అనంతపురం

రైతన్నకు ఖరీఫ్ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, జూన్, 24: ఖరీఫ్‌లో వేరుశెనగ సాగుచేసే రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో ముంగారు వర్షాలు కురడంతో రైతులు భూములు దున్ని నేలను సిద్దం చేశారు. విత్తనాలు సిద్దం చేసుకుని తీరా విత్తే సమయంలో కాడెద్దులు దొరక్క ఇక్కట్లకు గురవుతున్నారు. గ్రామాల్లో ఒకరిద్దరు రైతుల వద్ద మాత్రమే ఎద్దులు ఉండడంతో డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్లకూ డిమాండ్ పెరిగి రూ. 700 వరకు తీసుకుంటున్నారు. కాడెద్దులకు రోజు బాడుగ రూ. 1000 నుండి 1200 వరకు తీసుకుంటున్నారు. ఇంత ఖర్చుపెట్టుకుని రోజుకు నాలుగు ఎకరాల్లో మాత్రమే విత్తనాలు విత్తుతున్నారు. కాడెద్దుల సాయంతో విత్తనాలు విత్తుతుండగా వెనుక మరో జత గుంటక పాసేందుకు మరో రూ. 1000 బాడుగ తీసుకుంటున్నారు. విత్తనాలు వేసే ఒక వ్యక్తికి రూ. 500 చొప్పున ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. గతంలో ప్రతి ఇళ్లు పశువులతో కలకలాడేది. ఒకరికొకరు రైతులు తోడుగా సేద్యం పనుల్లో సహాయం చేసుకునేవారు. రానురాను పంటలు పండక, వరుస కరవులతో పశుగ్రాసం కొరత ఏర్పడి పశువులను కళేబరాలకు అమ్మేశారు. ఖరీఫ్ ప్రారంభం కావడం, వర్షాలు కురవడంతో ఎద్దుల సమస్య తలెత్తింది.