అనంతపురం

‘నాకూ కీర్తి కండూతి ఉంది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 27 : ‘నాకూ కీర్తి కండూతి ఉంది. సిఎం చంద్రబాబునాయుడులా పేరు తెచ్చుకుంటా. ఆయన మంచి పనులు చేశారు. జేజేలు కొట్టించుకుంటున్నారు. నాకూ ఆయనలా పేరు తెచ్చుకోవాలని ఉండదా? మాకూ మా ప్రాంతంలో జేజేలు కొట్టించుకోవాలని ఉంటుంది కదా!’ అని అనంతపురం ఎంపిత జెసి దివాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం అనంతపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి అడ్డుపడుతున్నారని, వెనకుండి మేయర్ స్వరూపను నడిపిస్తుండటం, కార్పొరేషన్‌లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. అనంతపురం నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. తాడిపత్రి తరహాలో నగ రాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులను ఎవరూ ఆపలేరు అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే, మేయర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ తాను అయ్యా.. అమ్మా.. అంటూ చేతులు జోడించి మొక్కుతూ వచ్చానని... అయినా వారు అడ్డుతగిలితే చేయాల్సిన పని చేస్తా అని అన్నారు. నగర పాలక సంస్థ నిధులు లేక అల్లాడుతుంటే సుందరీకరణ పేరుతో ఉన్న డివైడర్లు తొలగించి కొత్త వాటిని నిర్మించేందుకు పాలకవర్గం పూనుకోవడంపై జెసి ధ్వజమెత్తారు. నగరంలో రోడ్ల వెడల్పు, రైల్వేబ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో చేపడుతామన్నారు.