అనంతపురం

మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 30: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. డ్రైవర్స్ కాలనీలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాలులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం రంజాన్ ఇప్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటా ల సునీత, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్ యామినీ బాల, జడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యేలు ప్రభాకర చౌదరి, చాంద్‌బాషా, విశే్వశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు, నగర మేయర్ స్వరూప, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ము తవల్లీలు, ఇమాంలు, వౌజమ్‌లు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి రూ. 710 కోట్లు కేటాయించిందని, ముస్లిం మైనార్టీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. వక్ఫ్‌బోర్డు గుర్తింపు పొంది ఆదాయం తక్కువగా ఉన్న మసీదులకు 2500 మంది ఇమాంలకు రూ.5వేలు, వౌజమ్‌లకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ముస్లింలందరూ రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రంజాన్ తోఫాను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అందరూ నమాజ్‌లో పాల్గొని ముస్లింలతో కలసి ఇఫ్తార్ విందు చేశారు.