అనంతపురం

రైతు సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూన్ 30 : రైతుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత అన్నారు. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అధ్యక్షతన గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనతో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి ఉన్న పరిపాలన అనుభవం, సమర్థత కారణంగా కష్టాలను అధిగమిస్తూ నూతన రాజధానిని నిర్మిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని 85లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కరువు పారదోలడానికి ముఖ్యమంత్రి అంకుటిత దీక్షతో పని చేస్తున్నారన్నారు. జిల్లా రైతంగాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు పూర్తి సానుకూలంగా ఉన్నారన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాలోని అన్ని చెరువులనూ కృష్ణాజలాలతో నింపుతామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చిన ఘనత జిల్లా ప్రజలదన్నారు. జిల్లా ప్రజల రుణాన్ని తీర్చుకోవ డానికి టిడిపి తరపున రెండు కోల్డ్ స్టోరేజ్ గోడౌన్‌లను నిర్మించడానికి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్నా పాల ఉత్పత్తి కేంద్రాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి లాభాల బాటలో నడిపించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన ప్రతిపక్ష నేత జగన్ చర్యల కారణంగా 2019 నాటికి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు జోస్యం చెప్పారు. ప్రజలు చంద్రబాబుకు మద్దతు ఇస్తుండగా ప్రతిపక్ష నేత జగన్ మాత్రం 11 కేసులో ముద్దాయిగా ఉంటూ ముఖ్యమంత్రిపై బురద చల్లడానికి చూస్తున్నారన్నారు. ఇప్పటికే ఈడి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జగన్‌కు సంబంధించిన 756 కోట్ల ఆస్థులను అటాచ్ చేసుకున్న విషయాన్ని జగన్ గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే జగన్ అహంకార చర్యలకు పార్టీ ఎమ్మెల్యేలు విసిగి అధికార పార్టీ వైపు చేరుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లిన వెళ్లిన నేత ముఖ్యమంత్రి కావాలా... అవినీతి మచ్చలేని నేత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలా? అని ప్రశ్నించారు. దీంతో సభికులు చంద్రబాబు కావాలని పెద్దఎత్తున హర్షధ్వానాల మధ్య వ్యక్తం చేశారు.
కరవును జయిస్తాం
జిల్లాలో నెలకొన్న కరవును జయించేందుకు త్వరలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లామంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. జిల్లాను కరవు రహిత జిల్లాగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే త్వరలో జిల్లావ్యాప్తంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని చెరువులు, కుంటలను కృష్ణాజలాలతో నింపేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వర్షం బొట్టునూ నిల్వ చేసి భూగర్భజలాలను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఇందులో భాగంగా పంట సంజీవిని పథకం కింద లక్ష ఫారంపాండ్లు తవ్వడానికి రూ.700 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాను సశ్యశ్యామలం చేయడానికి ప్రతి ఒక్కరూ విస్తారంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. విప్ యామినీబాల మాట్లాడుతూ 30 సంవత్సరాల కిందట గుత్తిలో చిన్న అమ్మాయిగా తిరిగిన తాను ఇప్పుడు జిల్లా ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా మీ ముందుకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేటి నుంచి ముస్లింలకు రంజాన్‌తోఫా సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ రైతులు ఆకు కూరలు, కూరగాయలను ఇంటివద్దే పండించుకోవడానికి వీలుగా సబ్సిడీపై నవధాన్యాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుమునుపు పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ, మడకశిర ఎమ్మెల్యే వీరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్ తులశమ్మ, గుంతకల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ అపర్ణ, గుత్తి, గుంతకల్లు వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, బండారు ఆనంద్, గుత్తి ఎంపిపి వీరభద్రయ్య, పామిడి ఎంపిపి గౌస్‌మొద్దీన్, గుంతకల్లు ఎంపిపి రాయల్ రామయ్య, టీడీపీ నాయకులు శివలింగారెడ్డి, దిల్కాశీనా, రామూయాదవ్, ధర్మాపురం గోవిందు, కౌన్సిలర్లు గోవిందు, సుంకన్న పాల్గొన్నారు.