అనంతపురం

’క్షయ‘ను నిర్మూలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : ప్రజలందరూ ఐక్యంగా క్షయ వ్యాధి నిర్మూలన గురించి అవగాహన పెంచుకుని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటరమణ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక లలిత కళాపరిషత్ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జె ండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సర ం మార్చి 24న క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ‘యునైట్ టు ఎండ్ టిబి’ అనే నినాదంతో క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి సుధీర్‌బాబు మాట్లాడుతూ 1982 సంవత్సరం మార్చి 24న రాబర్ట్ కాక్ అనే శాస్తవ్రేత్త క్షయవ్యాధి క్రిమిణి కనుగొని నివారణకు అంకురార్పణ చేసిన సందర్భంగా నేడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో క్షయ వ్యాధి పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. క్షయ అంటు వ్యాధి కాదని ప్రజలు దీనిపై దృష్టి సారించి సామాజిక బాధ్యతగా అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ఎయిడ్స్ వచ్చిన వారి కి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలో వీలైనంత వరకూ టిబి కేసులు లేకుండా చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు. అంతకుముందు నిర్వహించిన ర్యాలీ రఘువీరా టవర్స్, సప్తగిరి సర్కిల్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ప్రతాప్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిషేక్, పిఓడిటి డాక్టర్ సుజాత, ప్రభుత్వ ఎఎన్‌ఎంల శిక్షణ కేంద్రం విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, ఆర్‌డిటి, జిల్లా ఎయిడ్స్ సెంటర్, మెప్మా గ్రూపులు, అనంత నెట్ వర్క్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం
* ఎస్పీకి వాట్సప్ మెసేజ్ పంపిన నేతన్న..
* రాజశేఖర్‌బాబు ఆదేశాలపై కాపాడిన పోలీసులు
ధర్మవరం, మార్చి 24: చేనేత చీరల వ్యాపారాలు చేస్తూ వ్యాపారాలు సరిగా జరగక చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో ఓ చేనేత వ్యాపారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకుని ముందస్తుగా జిల్లా ఎస్‌పి రాజశేఖరబాబుకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఇందుపై స్పందించిన ఎస్‌పి రాజశేఖరబాబు వెంటనే ఆ మెసేజ్‌ను ధర్మవరం డిఎస్‌పి వేణుగోపాల్, పట్టణ సిఐ విజయభాస్కర్‌గౌడ్‌లకు వుంచి అతన్ని కాపాడాలని ఆదేశించారు. దీంతో పట్టణ పోలీసులు గురువారం ఉదయం నుండి పలుచోట్ల గాలింపు చేపట్టి ఎట్టకేలకు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రైలు కోసం ఎదురుచూస్తున్న చేనేత వ్యాపారి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించి గురువారం రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్‌పి వేణుగోపాల్ సంఘటన వివరాలను వెల్లడించారు. స్థానిక చంద్రబాబునగర్‌లో బాడుగ ఇంటిలో బీరే మోహన్ కుటుంబం నివశిస్తోంది. కాగా బీరే మోహన్ హైదరాబాద్, తిరుపతి, ధర్మవరంలో పట్టు వ్యాపార దుకాణాలు నడిపినాతీవ్ర నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితికి దిగజారాడు. దీంతో మనస్తాపంగా వున్న బీరే మోహన్‌ను అతని భార్య సుగుణ ఓదార్చుతూ తాను మగ్గం నేసి నిన్ను, పిల్లలను కాపాడుకుంటానని, ఎలాంటి అఘాయిత్యం చేయవద్దని బతిమిలాడేది. అయినా అప్పులు తీర్చే వీలు లేక బీరే మోహన్ పలు పేజీల సూసైడ్ నోట్ రాసి దానిని ఎస్‌పి రాజశేఖరబాబుకు పంపుతూ వాట్సాప్ మెసేజ్‌ను సైతం వుంచాడు. విషయం తెలుసుకున్న ఎస్‌పి హుటాహుటిన ధర్మవరం డిఎస్‌పి వేణుగోపాల్, పట్టణ సిఐ విజయభాస్కర్‌గౌడ్‌లకు ఆ మెసేజ్‌లను పంపడంతో స్పందించిన పోలీసులు ఉదయం నుండి అతని ఆచూకీ కోసం పట్టణమంతా కలియతిరిగారు. ఎట్టకేలకు స్థానిక రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న బీరే మోహన్‌ను గుర్తించిన పోలీసులు వెంటనే అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి అతన్ని ఆత్మహత్యాయత్నం నుండి కాపాడగలిగారు. ఇదిలా వుండగా బీరే మోహన్‌కు దాదాపు రూ.10లక్షల దాకా అప్పులున్నట్లు డిఎస్‌పి తెలిపారు. బీరే మోహన్‌కు హైదరాబాద్, సికింద్రాబాద్, సోమందేపల్లి, ధర్మవరం ప్రాంతాలకు చెందిన 22మందికి దాదాపు రూ.10లక్షలకు పైబడి అప్పులు ఇవ్వాల్సి వుందన్నారు. అంతేకాక బీరే మోహన్ తిరుపతిలో దుకాణం నడుపుకునే సమయంలో దొంగతనం కావడంతో మరింత నష్టపోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్‌పి వేణుగోపాల్, పట్టణ సిఐలు బీరే మోహన్ దంపతులకు మనోధైర్యాన్ని నింపి ధైర్యంగా వుండాలని, మీ సమస్యలుంటే పోలీసులు తప్పక న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

శివపురం వైకాపా సర్పంచ్ ఇంట్లో
బాంబు పేలుడు
* నరసింహులుకు గాయాలు.. పరిశీలించిన డిఎస్పీ
కనగానపల్లి, మార్చి 24: వైకాపా సర్పంచ్ నరసింహులు ఇంటిలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు బాంబు పేలిన సంఘటన మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో సర్పంచ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల మేరకు వివరాలు... మండల పరిధిలోని శివపురం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్ పార్టీకి చెందిన సర్పంచ్ నరసింహులు కొత్తగా ఇల్లు నిర్మించే పనిలో వున్నాడు. అయితే పాత ఇంటి గోడలు కూల్చి వేస్తుండడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందన్నారు. శబ్దం రావడంతో అందరూ హఠాత్తులయ్యారు. కొద్దిసేపటికే అందరూ తేరుకుని చూడగానే సర్పంచ్ నరసింహులు గాయాలతో కనిపించాడు. చికిత్స కోసం వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సర్పంచ్‌కు గిట్టని వారు ఈ పని చేశారా? లేక ఫ్యాక్షన్ వల్ల గతంలో ఎవరైనా అతనికి సంబంధించిన ఇంటి గోడలో నాటుబాంబులను భద్రపరిచారా? అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బాంబుపేలుడు సంఘటన తెలిసిన వెంటనే ధర్మవరం డిఎస్‌పి వేణుగోపాల్, ఎస్‌ఐ రామారావు, సిబ్బందితో వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటన తీరు గురించి గల కారణాలను డిఎస్‌పి అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
వడదెబ్బకు గురై విద్యార్థిని మృతి
* 15 మందికి అస్వస్థత.. పరిశీలించిన ఆర్డీఓ రామ్మూర్తి
పరిగి, మార్చి 24 : మండలంలోని కొడిగెనహళ్లిలో ఉన్న నవోదయ, ఎపిఆర్‌ఎస్ ప్రవేశ పరీక్షల కోచింగ్ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ విద్యార్థిని వడదెబ్బతో మృతి చెందింది. మరో 15 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అధికారులకు తెలిపిన వివరాల మేరకు బ్రహ్మసముద్రం మండలం కపటలింగనహళ్లికి చెందిన నిఖిత (8)తోపాటు పలువురు విద్యార్థులు కొడిగెనహళ్లిలో కోచింగ్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో బుధవారం తీవ్రమైన ఎండ ప్రభావం వల్ల అస్వస్థకు గురై అర్ధరాత్రి పైన మృతి చెందినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి హుటాహుటిన కొడిగెనహళ్లికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికాగా గుట్టుచప్పుడు కాకుండా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. అయితే నిఖిత పరిస్థితి విషమించడంతోపాటు 15 మంది దాకా విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో రాత్రి హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే తీవ్రంగా నీరసించిపోయిన నిఖిత మృతి చెందినట్లు తెలిపారు. ఇకపోతే ఇంత తతంగం జరిగినా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తక్షణమే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా కోచింగ్ సెంటర్‌లో ఉన్న దాదాపు 200 మంది దాకా విద్యార్థినులను సెలవుల పేర ఇళ్లకు పంపారు. అయితే పూర్తి స్థాయిలో వివరాలు సేకరించేందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు ఆర్డీఓ తెలిపారు.

సామూహిక వివాహాలకు తప్పెట్లతో ఆహ్వానం
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, మార్చి 24: పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లు ఏప్రిల్ 21న నిర్వహించు సామూహిక వివాహాలకు ప్రజలను ఆహ్వానించడానికి ప్రత్యేక బృందాన్ని తయారుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరిని ఆకట్టుకునే తప్పెట్లతో గ్రామాలకు వెళ్లి ఈ సామూహిక వివాహాలకు ఆహ్వానించనున్నారు. వెంకటాపురంలో 600మంది తప్పెట కళాకారులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం మంత్రి పరిటాల సునీత జెండా ఊపి తప్పెట కళాకారులను ప్రచారానికి పంపారు. పరిటాల శ్రీరామ్ స్వయంగా తప్పెట కొడుతూ తప్పెట కళాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామూహిక వివాహాలు మా ఇంటిలో నిర్వహిస్తున్న పెళ్లిళ్లని, మా ఇంటి ఆడబిడ్డల పెళ్లిళ్లు నిర్వహించినట్లే ఘనంగా నిర్వహిస్తామని మంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లు అన్నారు. పెండ్లి కుమార్తె, పెండ్లికుమారుడుకు అవసరమైన చీరలు, తలపాగా, ఒడి బియ్యం సామాగ్రి మొత్తం అన్నీ సిద్ధం చేశారు. మేమే స్వయంగా దగ్గరుండి వీటిని కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల ఘాట్ దగ్గరకు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం రోజున పెళ్లిళ్ల నమోదు 100కు చేరినట్లు మంత్రి తండ్రి కొండన్న తెలిపారు. పెళ్లిళ్ల నమోదును మంత్రి పరిటాల సునీత దగ్గరుండి సమీక్షించారు. గురువారం రోజే దాదాపు 20 జంటల పేర్లు నమోదు చేశారు.
తాగునీటి అవసరాలకు
రూ.10 కోట్లు మంజూరు
* జిల్లా పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఇ అంకయ్య
గుంతకల్లు, మార్చి 24 : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ నిమిత్తం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఇ అంకయ్య, ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అన్నారు. ఈమేరకు గురువారం స్థానిక ట్యాంకులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి కోసం మంజూరు చేసిన రూ.10 కోట్లలో రూ.30 లక్షలు అవసరం మేరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పైపులైన్ల మరమ్మతులు, కొళాయిల క్రమబద్ధీకరణ, నీటి వృథాను అరికట్టి రోజూ తాగునీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని 13 ఓవర్ హెడ్ ట్యాంకులతో పాటు జెసి నాగిరెడ్డి పథకం కింద ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ ట్యాంకును వినియోగంలోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇఇ శ్రీనాథ్‌రెడ్డి, ఎంఇలు సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గౌడ్, డిఇలు హనుమన్న, యల్లారెడ్డి, నారాయణ, తహశీల్దార్ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
పన్ను చెల్లింపుపై ద్వంద్వ వైఖరి తగదు
* నీటి పన్ను పెంచొద్దు * కౌన్సిల్ సమావేశంలో సభ్యులు
హిందూపురం టౌన్, మార్చి 24 : రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా హిం దూపురం మున్సిపాలిటీలో టిడిపి నా యకులు పన్నుల చెల్లింపులపై ద్వంద్వ వైఖరి అవలంభించడం తగదని వైకాపా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా సభ్యులు శివ, నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ ఓవైపు అధికార పార్టీకి చెందిన చైర్‌పర్సన్ వందశాతం పన్నులు వసూలు చేయాలని చెబుతుండగా మరోవైపు అదేపార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే బాలకృష్ణ సూచన మేరకు పన్నులు చెల్లించవద్దని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులే మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టే విధంగా పన్నులు చెల్లించవద్దని ప్రజలకు పిలుపునివ్వడం ఏంటన్నారు. ఇదే విషయమై ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి లేఖ రాయడం సరైంది కాదన్నారు. ఇందుకు చైర్‌పర్సన్ లక్ష్మి స్పందిస్తూ రాష్ట్రంలో చోటు చేసుకున్న కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అవకాశం ఉంటే పన్నులపై ఉన్న వడ్డీని మాఫీ చేయాలని, సమయాన్ని పొడిగించాలని కోరారన్నారు. అయితే లేఖలో ఎక్కడా ప్రజలకు పన్నులు చెల్లించవద్దన్న విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని సూచించారు. ఇకపోతే 14వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రస్తుతం చెల్లిస్తున్న నీటి పన్నులను పెంచడానికి సిఫార్సు చేయడం పట్ల కౌన్సిల్ సభ్యులు అనంతరం వ్యక్తం చేశారు. అసలే మున్సిపాలిటీలో అంతంత మాత్రంగా నీరు ఇస్తుండటంతో ప్రజలు నీటి పన్నులను చెల్లించలేకపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి పన్నులు పెంచడం సరైంది కాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని మానుకోవాలన్నారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ పిఏబిఆర్ నుండి ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడం, మన్సిపాలిటీలో ఉన్న బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోతుండటంతో పట్టణంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొందన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో ఉచిత ట్యాంకర్ల నీటి సరఫరా కూడా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వర్షాలు కురిసే వరకు పట్టణంలో మెరుగైన నీటి సరఫరాకు కౌన్సిల్ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ట్యాంకర్ల నీటి సరఫరాపై సభ్యులు దృష్టి సారించాలన్నారు. ఎలాగైనా ప్రజలకు నీరు అందించడం బాధ్యతగా గుర్తించాలని, ఇందుకోసం సమైక్యంగా ముందుకెళ్దామని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జెపికె రాము, మున్సిపల్ ఇంజనీర్ రమేష్, డిఇ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
ఉరవకొండ, మార్చి 24 : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కరిబసప్పస్వామి గవిమఠం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యపై రూ.31కోట్లు అవసరం ఉంటే ఇప్పటి వరకూ ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. వేరుశెనగ పంట సాగు చేయడానికి జిల్లాలో 3.90 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనం అవసరమన్నారు. అయితే జిల్లా అధికారులు ఇంత వరకూ విత్తనాలు కొనుగోలు చేయలేదన్నారు. కాగా ఉరవకొండలో ఈనెల 28, 29 తేదీల్లో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి, రాయలసీమ నాయకులు ఓబులు హాజరౌతున్నట్లు తెలిపారు. 1946లో ఉరవకొండలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జిల్లా మహాసభలు నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో అనేక కంపెనీలు భూములను కొనుగోలు చేసి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నాయన్నారు. అయితే కంపెనీల పేర గతంలో కొనుగోలు చేసిన భూములు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి రంగారెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యుడు రాయుడు, నాయకులు జ్ఞానమూర్తి, మధుసూదన్‌నాయుడు, ఆంజనేయులు, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనృసింహస్వామి పార్వేట ఉత్సవాలు
ఆత్మకూరు, మార్చి 24: పంపనూరు సమీపాన కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పరుష పారువేట ఉత్సవాలు నిర్వహించారు. పరుష రోజు వై.కొత్తపల్లి గ్రామస్థులు ముందుగా పనే్నరపు బండి వచ్చి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాక గ్రామాల నుంచి వచ్చిన పనే్నరపు బండ్లు స్వామివారికి ప్రదక్షిణ చేస్తాయి. వై.కొత్తపల్లి గ్రామం నుంచి వచ్చిన పనే్నరపు బండికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేళతాళాలతో స్వాగతం చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తతంగం ముగిశాక స్వామివారికి ప్రదక్షిణ చేయడానికి మిగిలిన వారు ముందుకెళ్తారు. గురువారం సాయంత్రం 4 గంటల తరువాత భక్తులు పరుషకు తరలిరావడం ప్రారంభమైంది. అర్దరాత్రివేళ స్వామివారు ఉత్సవమూర్తుల రూపంలో కొండదిగి వచ్చి పరుష చూస్తారు. పారువేట అర్దరాత్రి నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తోన్న ఆచారమే. పరుషకు విచ్చేసిన భక్తుల కోసం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ అన్నదాన సమితివారు ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం కొండ కింది భాగంలో ఏర్పాటుచేశారు. మినరల్ వాటర్ వ్యవస్థ ఏర్పాటుచేశారు. 25మంది సిబ్బందితో సిఐ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ యేడు పనే్నరపు బండ్ల స్థానంలో ట్రాక్టర్లు, ఆటోలకు అలంకరణ చేసుకుని ఎక్కువమంది స్వామివారికి ప్రసాదాలు తీసుకువచ్చారు.
ఇస్కాన్‌లో హోలీ సంబరాలు
అనంతపురం కల్చరల్, మార్చి 24: నగర సమీపంలోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో గురువారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా రంగులు చల్లుకున్నారు. అనంతరం దామోదర గౌరంగదాస్ ప్రభు మాట్లాడుతూ హోలీ యుగ యుగాలుగా వస్తున్న పండుగ అన్నారు. కుల, మతాలకతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకుంటారన్నారు.

యువతి ఆత్మహత్య
గుడిబండ, మార్చి 24 : మండల పరిధిలోని సింగేపల్లిలో హేమలత (19) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. హేమలత గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధ పడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
అమడగూరు, మార్చి 24: మండల పరిధిలోని బీగలవారిపల్లి గ్రామానికి చెందిన మేకల రాజేంద్రబాబు(20) గురువారం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ఎస్‌హెచ్‌ఓ సూర్యనారాయణ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. గ్రామానికి చెందిన నరశింహులు కుమారుడు ఐటిఐ చేస్తూ వున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎఎస్‌ఐ రామచంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
పరిగి, మార్చి 24 : మండల పరిధిలోని కొడిగెనహళ్లి సాయినగర్‌లో నివాసం ఉంటున్న గంగాధర్ (33) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. గంగాధర్ కొబ్బరిబొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండగా కుటుంబ పోషణకు ఆదాయం లేకపోవడంతో తరచూ ఘర్షణ పడేవారు. రోజురోజుకూ ఆదాయం తగ్గిపోతుండటం, అప్పులు పెరిగిపోతుండటంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
బుక్కరాసముద్రం, మార్చి 24: నవ మాసాలు మోసి కనిపెంచిన పాపానికి తన కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన ఎరికల కుళ్ళాయమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో సాయంత్రం 4గంటల సమయంలో ఈ దారుణం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలం చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కుళ్ళాయమ్మ కొడుకు రుషింగులు ఆమె తండ్రిపైకి గొడవకు పోయి కొడుతుండగా ఆమె అడ్డువెళ్లడంతో మద్యం మత్తులో వున్న రుషింగులు తన తల్లిని రోకలిబండతో తలపై బాదడంతో ఆమె తన ఇంటిలోని పశువుల పాకలో పడి మృతి చెందింది . బుక్కరాయసముద్రం ఎస్సై విశ్వనాథచౌదరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రుషింగులు పరారీలో వున్నాడు.