అనంతపురం

ఎమ్మెల్యే చౌదరివి బురదజల్లే మాటలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 26: ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తమ కుటు ంబంపై బురదజల్లే మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం పార్టీ కా ర్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ప్ర శ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే చౌ దరి మిస్సమ్మ స్థలాన్ని ప్రభుత్వం స్వా ధీనం చేసుకోవాలని పేర్కొనడం అవగానా రాహిత్యానికి అద్దంపడుతోందన్నారు. మిస్సమ్మ స్థలాన్ని తాము ప్ర భుత్వ నియమ నిబంధనలకు లోబడి, రిజిస్ట్రేషన్ చట్టానికి అనుగుణంగా కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. గతంలో మునిసిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, ఎపి హౌసింగ్ సౌసైటీ స్థలాన్ని కాజేసిన ఘనత ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిదన్నారు. మిస్సమ్మ స్థలాన్ని తాను అప్పగిస్తే టిడిపిలో చే ర్చుకోవడానికి అభ్యంతరం లేదని పే ర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇతర పార్టీల వారిని టిడిపిలో చేర్చే ప ని ఎప్పటినుండి మొదలు పెట్టారని ప్ర శ్నించారు. తమది వ్యవసాయ కుటుంబమని, కాంట్రాక్ట్ పనులు, వ్యవసా యం ద్వారా వచ్చిన సొమ్ము తో ఆస్తు లు కొనుగోలు చేశాము తప్ప కబ్జాలకు పాల్పడేవారం కాదన్నారు. తాను టిడిపిలో చేరే ప్రశే్న లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైకా పా నాయకులు గోపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, యుపి.నాగిరెడ్డి పాల్గొన్నారు.

పట్టు రైతులకు ప్రోత్సాహం
* పట్టుపరిశ్రమ శాఖ జెడి అరుణకుమారి

మడకశిర, మార్చి 26 : జిల్లాలోని పట్టు రైతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాల కింద రూ.1.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పట్టుపరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ అరుణకుమారి తెలిపారు. అయితే నిధుల కొరత కారణంగా చెల్లించలేకపోతున్నామని, ప్రత్యామ్నాయ నిధుల ద్వారా చెల్లించడానికి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. శనివారం గుడిబండ, మడకశిర మండలాల్లో పర్యటించి పట్టు రైతులు నిర్మించుకుంటున్న షెడ్లు, చాకీ సెంటర్లను పరిశీలించారు. అనంతరం మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ పట్టు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బైవోల్టిన్‌కు రూ.50, క్రాస్ బ్రీడ్ రకానికి రూ.10 వంతున చెల్లించేదన్నారు. అయితే ఫిబ్రవరి నుంచి ఈ నిధులు చెల్లించలేకపోతున్నట్లు చెప్పారు. బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తిలో జిల్లాలోనే మడకశిర ప్రథమ స్థానంలో ఉందన్నారు. మార్చి నాటికి 19 లక్షల గుడ్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే 22 లక్షలు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. హిందూపురం, మడకశిర, ధర్మవరం, కదిరి, పెనుకొండ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున లోకాస్ట్ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు. వేసవిలో ఎండలు అధికంగా ఉండటంతో మల్బరీ షెడ్లలో పురుగుల పెంపకానికి కూలింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆర్‌కెవివై కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులకు 50 శాతం సబ్సిడీతో షెడ్లు మంజూరు చేస్తున్నామని, ఆయా వర్గాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. షెడ్ల నిర్మాణం చేసుకునే రైతులకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింజేస్తున్నట్లు తెలిపారు. కాగా బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తికి టెక్నికల్ అసిస్టెంట్లు శ్రద్ధ తీసుకోకపోతే వారిని విధుల నుండి తొలగించేందుకు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎడి శశాంక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

శెట్టూరు అభివృద్ధికి కృషి
* జడ్పీ చైర్మన్ చమన్

శెట్టూరు, మార్చి 26 : కర్నాటక సరిహద్దు ప్రాంతం శెట్టూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్, తాగునీటి సౌకర్యం, వైద్యం, ఆరోగ్యం వంటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. వేసవి కారణంగా ప్రజలకు అవసరమైన ఓఆర్‌ఎస్‌తో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో ఎంపిపి మానస, జడ్పీటీసీ కవిత, ఉపాధ్యక్షులు బొమ్మయ్య, మండల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

పూలపల్లకిలో శ్రీవారి గ్రామోత్సవం

రొళ్ల, మార్చి 26 : లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పూల పల్లకిలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో మూల విరాట్‌ను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు.

పట్టు పరిశ్రమపై అవగాహన

పెనుకొండ, మార్చి 26 : మండల పరిధిలోని కోనాపురంలో శనివారం ఆత్మా ఆధ్వర్యంలో పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్తవ్రేత్త విద్విన్ మాల మాట్లాడుతూ అధునాతన పద్ధతులు అవలంభించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టు పరిశ్రమ రైతుల కోసం ఎన్నో అధునాతన పద్ధతులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సెరికల్చర్ ఎడి శివానందరెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ద్వారా షెడ్ల నిర్మాణం, పనిముట్లను రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

పెనుకొండ, మార్చి 26 : పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు శనివారం ఇంటర్వ్యూలు జరిగాయి. డివిజన్ పరిధిలోని పెనుకొండ, హిందూపురం, మడకశిర, కదిరి, కదిరి వెస్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని కార్యకర్తల పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 62 పోస్టులకు 91 మంది దరఖాస్తుదారులకు జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖజామోహిద్దీన్, ఐసిడిఎస్ పిడి జుబేదాబేగం, ఆర్డీఓ రామ్మూర్తి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ దివాకర్‌లు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ప్రజా గరుడ సేవలో భక్తులకు
దర్శనమిచ్చిన నృసింహుడు

కదిరి, మార్చి 26: శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారు ప్రజా గరుడ సేవ ఉత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యాగశాలలో శ్రీవారికి ఆలయ మర్యాదలతో నిత్య హోమం, నిత్య కైంకర్యములుగావించారు. అనంతరం సాయంత్రం మండపోత్సవం నిర్వహించారు. బ్రహ్మ గరుడ సేవ ఉత్సవం అనంతరం జరిగే ప్రజా గరుడ సేవ ఉత్సవంను ప్రజలే శ్రీవారికి నిర్వహించడం వల్ల ఈ ఉత్సవానికి ప్రజా గరుడ సేవ అనే పేరు వచ్చింది. దీనే్న స్థానికులు మలి గరుడ సేవ ఉత్సవం అని కూడా పిలుచుకుంటారు. ఇలా శ్రీమన్నారాయణుడు భక్తుల కోసం ప్రజా గరుడ సేవ ఉత్సవం ద్వారా దర్శనమిచ్చి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వదించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఉత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీవారిని దర్శించుకొని భక్తిపారవశ్యం పొందుతారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్, పలువురు పట్ణణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉత్సవం ఉభయదారులుగా కరణం లక్ష్మిపతిరావు వానవోలు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.