అనంతపురం

సత్యసాయి సేవలు వెలకట్టలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 12 : అనితర సాధ్యమైన సేవలను సుసాధ్యం చేసిన భగవత్ స్వరూపుడు సత్యసాయి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. మంగళవారం అంతర్జాతీయ యువజన సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలకు సైతం చేతకాని, వీలుకాని సేవలను భగవాన్ సత్యసాయి బాబా చేసి చూపిన మార్గదర్శకులన్నారు. విద్య, వైద్యం, తాగునీరువంటి సేవా కార్యక్రమాలకు వేల కోట్లు వెచ్చించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి పేరిట ప్రతి నిత్యం సేవలు అందడం జరుగుతోందన్నారు. సాయి స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత నేటి యువతదేనన్నారు. ప్రపంచానికి దశ, దిశ నిర్దేశాన్ని చూపే విధంగా సత్యసాయి అంతర్జాతీయ యువజన సమ్మేళనం స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇకపోతే సత్యసాయి యువజన సమ్మేళనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని పంపారు. ఈ సందర్భంగా సత్యసాయి అంతర్జాతీయ సేవా సమితుల కౌన్సిల్ సభ్యులు డా. నరేంద్రనాథ్‌రెడ్డి ప్రధాని మోదీ ప్రసంగాన్ని సభికులకు విన్పించారు. ఆయన తెలిపిన మేరకు దేశ ప్రగతికి ప్రపంచ దిశ దశ నిర్దేశానికి నేటి యువతే ప్రధానమన్నారు. బాబా ప్రసాదించిన సేవలు, సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ భారత్‌ను అనుసంధానం చేసుకుని దేశాన్ని సచ్ఛంగా వుంచేందుకు యువత నడుం బిగించాలన్నారు.