అనంతపురం

బిసి బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 26 : బిసి కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా చేపట్టనున్న నిధుల కేటాయింపుల్లో జిల్లాకు ప్రాధాన్యత లభించేనా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈమేరకు బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ సమాచారం రావడంతో శనివారం రాత్రి హుటాహుటిన ఆయన బయలుదేరివెళ్లారు. ఈయనతోపాటు 13 జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వెనుకబడిన తరగతుల ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావాలని సమాచారం అందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలదాకా జరుగే సమీక్షలో ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎండిలు హాజరవుతున్నట్లు రంగనాయకులు తెలిపారు. ఇకపోతే కరవు కాటకాలతో సతమతమవుతున్న జిల్లాకు బిసి కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు పక్కా ప్రతిపాదనలతో వెళ్తున్నట్లు సమాచారం. బిసి కార్పొరేషన్ చైర్మన్ కూడా జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా నిధులు కేటాయింపుపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
వడదెబ్బకు మరో ఇద్దరు బలి
బత్తలపల్లి/కనగానపల్లి, మార్చి 26: వడదెబ్బకు గురై శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. కనగానపల్లి మండలం ముక్తాపురానికి చెందిన నారాయణమ్మ(60), బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన పెద్దనరసింహులు(67) మృతి చెందారు. బత్తపలపల్లి మండలంలోని గంటాపురం గ్రామానికి చెందిన పెద్దనరసింహులు(67) వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు పెద్ద నరసింహులు గత కొంతకాలంగా వ్యవసాయ బావి వద్ద కాపలాగా వుంటున్నాడని, గత మూడు రోజుల క్రితం వాంతులు, విరేచనాలు అధికం కావడంతో స్వగ్రామానికి రాగా ఇక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కాగా కనగానపల్లి మండల పరిధిలోని ముక్తాపురం గ్రామానికి చెందిన నారాయణమ్మ(60) వడదెబ్బ తగిలి శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన కమ్మ నారాయణమ్మ శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్ళిందని, ఉపాధి పనుల నుండి వచ్చిన వెంటనే వరిమడి కొయ్యడానికి కూలి పనికి వెళ్ళిందన్నారు. దీంతో శుక్రవారం రాత్రంతా నీరసంగా వుందని తెలిపిందని వారు తెలిపారు. దీంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ శివయ్య, ఎంపిడిఓ జలజాక్షితోపాటు సర్పంచ్ సూర్యశేఖరరెడ్డి శనివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు.