అనంతపురం

నోటిఫికేషన్‌తో సరి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 27 : జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పట్టణ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను తగ్గించడానికి కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా 18.10.2014వ తేదీన నియామకపు ప్రకటన ను జారీ చేయగా అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపేందుకు ఆఖరు తేదీ 27.10.2014 గా నిర్ణయించింది. ఇలా అప్పడు నోటిఫికేషన్ జారీ చేయగా అప్పటి నుంచి ఇప్పటివరకూ దానిపై ఏ మాత్రం కదలిక లేకపోవడం గమనార్హం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పథకం కింద వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో సైతం ఇంటింటికీ తిరిగి మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులోడిస్ట్రిక్ ప్రోగ్రామ్ ఆఫీసరు(డిపిఓ), ఎఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులోజిల్లా కలెక్టరు ఛైర్మన్‌గా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇందుకుగానూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించి ఐదు నెలల క్రితం వౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) కు అభ్యర్థులను ఆహ్వానించారు. అయితే ఆ సమయంలోజిల్లా సంయుక్త కలెక్టరు లేరన్న సాకుతోవౌఖిక పరీక్షను వాయిదా వేయగా ఇప్పటికీ దానిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి వచ్చే నిధులు నిలిచిపోతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ పథకం కింద పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిలో ఆందోళన నెలకొని ఉంది. దీంతోఒకటిన్నర సంవత్సరం క్రితం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ఉద్యోగ భర్తీ సైతం నిర్వహిస్తారా లేదా అన్న సంశయం అభ్యర్థుల్లో నెలకొని ఉంది. దీనిపై ఈ కమిటీకి ఛైర్ పర్సన్‌గా ఉన్న కలెక్టరు, కన్వీనరుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని వౌఖిక పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.