అనంతపురం

వేసవితాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 27 : జిల్లాలోభానుడి ప్రతాపంతోఅత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే ఉన్నాయి. జిల్లాలో ఆదివారం సగటు ఉష్ణోగ్రత 40.5 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా పుట్టపర్తిలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక జిల్లాలోని తనకల్లులో43.4 డిగ్రీలు, గుడిబండలో43.0 డిగ్రీలు, బుక్కపట్నంలో42.7 డిగ్రీలు, పామిడిలో42.6 డిగ్రీలు, యాడికి, పరిగి లలో42.5 డిగ్రీలు, రాయదుర్గం, గుంతకల్లు లలో42.4 డిగ్రీలు, రామగిరి, పుట్లూరు, గార్లదినె్న, శింగనమల లలో42.3 డిగ్రీలు, గుత్తి, గుంతకల్లులలో41.7 డిగ్రీలు, చెనే్నకొత్తపల్లిలో41.9 డిగ్రీలు, తాడిమర్రి, యల్లనూరు, ఉరవకొండ, పెద్దపప్పూరులలో41.6 డిగ్రీలు, ధర్మవరం లో41.1డిగ్రీలు, తాడిపత్రిలో41.0 డిగ్రీలు, కదిరిలో40.4 డిగ్రీలు, హిందూపురంలో40.3 డిగ్రీలు, కళ్యాణదుర్గం, గోరంట్లలలో 40.2 డిగ్రీలు, పెనుకొండలో40 డిగ్రీలు, బుక్కరాయసముద్రం, నార్పల, అనంతపురం లలో39.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక జిల్లాలోని 73 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ లలో40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఈ నెలాఖరు వరకూ ఇదే రకమైన పరిస్థితులు కొనసాగనున్నట్లు వ్యవసాయ వాతావరణ శాస్తవ్రేత్త యస్ యన్ మల్లీశ్వరి తెలిపారు.
పుట్టపర్తిలో విదేశీ భక్తుల ఇక్కట్లు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, మార్చి 27 : జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో రోజూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో విదేశీ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 18న 41.8, 19న 41, 20న 42, 21న 41.9, 22న 46.6, 23న 48.1, 24న 47.2లు, 25న 47.4, 26న 45.7, 27న 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో వేసవి విడిదితోపాటు సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.