అనంతపురం

అక్రమాలకుపాల్పడితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 18: ప్రభుత్వం నిర్ధేశించిన సరుకులను నిర్ధేశించిన పరిమాణంలో అర్హులకు పంపణీ చేయాకపోతే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. సోమవారం పౌర సరఫరాల అంశాలపై డ్వామా హాల్‌లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మంత్రి ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 33 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను మంత్రికి వివరించారు. అందులో కొన్ని కుటుంబంలో 5 మంది సభ్యులున్నామని, అయితే ముగ్గురికి మాత్రమే రేషన్ ఇస్తున్నారని, మిగిలిన ఇద్దరికి రేషన్ ఇప్పించాలని 5వ రోడ్డులోని మున్నీసా ఫోన్‌లో మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి స్పందించి తక్షణమే ఆధార్‌ను అనుంసంధానం చేసి 5 కుటుంబ సభ్యులకు రేషన్ ఇవ్వాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. గత 3 కోటాలుగా కిరోసిన్ డీలరు ఇవ్వడం లేదని నల్లమాడ మండల రెడ్టిపల్లి గ్రామ ప్రజలు ఫోన్ ద్వారా మంత్రికి తెలిపారు. గుంతకల్లు నుండి కొంతమంది రైతులు ఫోన్ చేసి రైతుబజారును మార్కెట్ యార్డుకు సమీపంలో నిర్మించాలని కోరారు. తాడిపత్రిలోని నంబర్ 2 షాపు వారు కిరోసిన్, చక్కెర ఇవ్వడం లేదని తాడిపత్రికి చెందిన రాజశేఖర్‌రెడ్డి మంత్రికి ఫోన్ ద్వారా తెలిపారు. ధర్మవరం షాపు నంబర్ 77 డీలరు తూకంలో మోసం చేస్తున్నారని, అడిగితే బెదిరిస్తున్నారని ఆ డివిజన్‌లో జిలాన్ బాషా తెలిపారు. ఇలాంటి 33 సమస్యలపై సంబందిత తహశీల్దార్లుతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించారు.