అనంతపురం

సకలాంగులకు దీటుగా రాణిస్తున్న వికలాంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 21: ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తూ సకలాంగులకు దీటుగా వికలాంగులు రాణిస్తున్నారని రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత అన్నారు. రాప్తాడు సమీపంలోని టిటిడిసిలో సమర్థనా ట్రస్టు ఆధ్వర్యంలో అంధులకు కంప్యూటర్ విద్యలో శిక్షణా తరగతులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని ప్రతి ఒక్కరు సమాజానికి సేవ చేసి తమ జీవితాలను చరితార్ధం చేసుకోవాలన్నారు. ఏ వ్యవస్థయినా, ఏ వ్యక్తయినా అభివృద్ధి సాధించాలంటే ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. శరీరానికే అంగవైకల్యం అని, మనసుకు కాదని వికలాంగులు నిరూపించారన్నారు. రాష్ట్రాన్ని సాంకేతిక విప్లవంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి డిజిటల్ ఏపిగా మార్పు తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. డిజిటలైజేషన్‌లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోకి మన రాష్ట్రం ఇటీవల ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నిలిపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి పరిటాల కుటుంబం ముందుగా ఉంటుందని తెలిపారు. పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినపుడు కార్మికులకు, అవసరమైనపుడు ఖైదీలకు సేవలు అందించారని తెలిపారు. అంధులకు సమర్థనా ట్రస్టువారి ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. టిటిడిసిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, టిటిడిసి అభివృద్ధికి దీనదయాల్ ఉపాధ్యాయ కేశవ వికాస యోజన కింద రూ.70 లక్షలు మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్వరూప, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, రాప్తాడు సర్పంచ్ వెంకటరాముడు, ఎంపిపి దగ్గుపాటి ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.