కడప

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో బిటెక్ విద్యార్థుల పాత్రతో ఉలిక్కిపడ్డ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 29: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు నిన్నటి వరకు జిల్లాలోని చోటా మోటా నేతలు తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అంతర్‌రాష్ట్ర, అంతర్జాతీయ స్మగ్లర్లు, వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ల ప్రమేయంతో పోలీసు అధికారులు స్మగ్లింగ్ నివారణకు వేగవంతం చేశామని ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తాజాగా విద్యార్థుల ప్రమేయంతో పోలీసు అధికారులు ఖంగుతిన్నారు. అయిదారు సంవత్సరాలుగానే బిటెక్ విద్యార్థులు స్మగ్లింగ్‌లో అడుగుపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడితో పోలీసు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ముఖ్యంగా డైరెక్ట్ డిఎస్పీగా రాజంపేటలో బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర బిటెక్ విద్యార్థులు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అడుగుపెట్టడంపై తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ రాజంపేట డివిజన్‌లోని డిగ్రీ, పిజి, బిటెక్, ఫార్మసీ కాలేజిలపై దృష్టిసారించారు. తేజ వర్మ అనే బడా స్మగ్లర్ బిటెక్ విద్యార్థి 50మంది పైబడి విద్యార్థులను స్మగ్లింగ్‌లోకి దించినట్లు తెలుస్తోంది. విలాస జీవితాలకు అలవాటుపడిన ఈ విద్యార్థులు విద్యాసంస్థల్లో క్రమశిక్షణ లోపించి తల్లిదండ్రులు వారిని పట్టించుకోక విద్యార్థులు కోరిందల్లా కొనుగోలు చేయించి ప్రస్తుతం స్మగ్లర్లుగా మారడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారి అసాంఘిక కార్యకలాపాలపై అడుగుపెట్టడంపై తల్లిదండ్రులకు కనుకులేకుండా చేస్తోంది. తేజవర్మ బిటెక్ విద్యార్థి బడా స్మగ్లర్‌గా పేరుతెచ్చుకుని కార్యకలాపాలు చేస్తున్న విషయం రైల్వేపోలీసులకు తెలిసినా కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే బిటెక్ విద్యార్థులంతా స్మగ్లింగ్‌లో అడుగుపెట్టారు. వీరంతా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలకు స్మగ్లర్లతో సంబంధాలుపెట్టుకుని దర్జాగా ద్విచక్రవాహనాల్లో తిరుగుతూ రెక్కిలు నిర్వహించి ఎర్రచందనాన్ని ఎల్లలుదాటిస్తున్నట్లు తెలుస్తోంది. యువతలో డాన్‌గా పేరుపొందిన ఆ బిటెక్ విద్యార్థి తేజవర్మ ఫైవ్‌స్టార్, సెవెన్‌స్టార్ హోటళ్లలో నిత్యం విమానాల్లో తిరుగుతూ చిన్నవయస్సులోనే విద్యలో ఉన్నతశిఖరాలు చేరుకోవాల్సిన ఆ విద్యార్థి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.
ముఖ్యంగా ప్రపంచంలోనే మాఫియా డాన్‌గా పేరుగాంచిన దావూద్ ఇబ్రహీం తోనే సంబంధాలు ఉండాయంటే జిల్లాలోని యువత ఢిల్లీ, ముంబాయి వివిధ రాష్ట్రాల్లో కరుడుగట్టిన తీవ్రవాదులతోనే సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు ఒక డిఐజి అధికారిణి, ఇరువురు డిఎస్పీలను , దాదాపు 400 పోలీసులు, సిబ్బందిని నియామకం చేసినా వారునిఘాలో పూర్తిగా వైఫల్యం చెందారనేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో విద్యార్థులు పట్టుబడటమే నిదర్శనమనిచెప్పవచ్చు. రాజంపేట విద్యార్థులకే ఎర్రచందనం స్మగ్లింగ్ పరిమితమయ్యిందో లేదా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులేమైనా సంబంధాలున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. పట్టుబడిన బిటెక్ విద్యార్థులకు చిత్తూరు, తిరుపతి పట్టణాలకు చెందిన విద్యార్థులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. స్వయంగా జిల్లాస్థాయి అధికారులు విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాల్లో చిక్కుకోకుండా చర్యలు తీసుకోని పక్షంలో జిల్లా వ్యాప్తంగా యువత తప్పుదోవపట్టే అవకాశాలు కన్పిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

విషాధంలో ‘పది’ పరీక్షలు

మైదుకూరు, మార్చి 29:తల్లిదండ్రులు దారుణ హత్యకు గురైన విషాధకర సంఘటనతో కడపజిల్లా మైదుకూరు జడ్పీ ఉన్నతపాఠశాలలో పట్టే వెంకటేష్ మంగళవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్ష రాయాల్సిన విషాధకర సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రేణుకా యల్లమ్మగుడి సమీపంలోని పట్టెం వెంకటేష్ స్థానిక టివిఎస్‌ఎం ఉన్నతపాఠశాలలో పదవ తరగతి చదివి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున వెంకటేష్ తండ్రి అయ్యవారు, తల్లి నాగులును అత్యంత కిరాతకంగా కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ సంఘటనతో దిగ్భ్రాంతి చెందిన వెంకటేష్ తల్లిదండ్రుల దారుణ హత్యను చూసి సొమ్మశిల్లిపోయాడు. ఈ సంఘటన పలువురి హృదయాలను కలచివేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం గణితం పేపర్-1 పరీక్ష రాయాల్సి వుంది. విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా టివిఎస్‌ఎం హైస్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు ఆ విద్యార్థికి మనోధైర్యం చెప్పి జడ్పీహైస్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పరీక్షా కేంద్రం చీఫ్ వెంకటలక్ష్మమ్మ జరిగిన సంఘటనపై విద్యార్థికి మనోధైర్యం చెప్పి పరీక్షలు బాగా రాయాలని సూచిస్తూనే ఆమె ఆ విషాదాన్ని తట్టుకోలేక బోరున విలపించింది. అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు కూడా పరీక్షా కేంద్రానికి వచ్చి విద్యార్థికి ధైర్యం చెప్పడంతో వెంకటేష్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు.

ఎన్‌టిఆర్ ఆశయ సాధనకు బాబు కృషి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 29: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) నేతృత్వంలో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ విగ్రహానికి పాలాభిషేకంచేసి పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్‌ను కట్ చేసి ఘనంగా ఎన్‌టిఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ దివంగత నేత ఎన్‌టి రామారావు ప్రాంతీయ పార్టీని స్థాపించి దేశస్థాయిలోనే తెలుగుప్రజల ఔనత్యాన్ని, సమానత్వాన్ని సౌబృత్వాన్ని చాటిచెప్పారని ఆయన కొనియాడారు. అదే రీతిలో ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికోసం అన్నివర్గాల వారికి న్యాయం చేసే విధంగా కృషిచేస్తున్నారని, దీన్ని చూసి ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేక తమ పార్టీ నేతలపై అవాకులు చవాకులు వాగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో ముఖ్యంగా సినీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపి పాలనలో ఉండటంతో రాష్ట్భ్రావృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని ప్రకటించడం అందరికీ యోగ్యమేనని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి జగన్ సామాజికవర్గం నేతలంతా టిడిపి కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు. పదవులు, ఇతరత్రాలపై ఆధారపడి ఏ ఒక్కరూ తెలుగుదేశంపార్టీలో చేరడం లేదని కేవలం జిల్లా అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకుని చేరుతున్నారన్నారు. ప్రధానంగా పేద , బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పారు. అలాగే ముఖ్యంగా మహిళలను అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు, వారు ఆర్థికంగా ఎదిగేందుకు టిడిపి కంకణం కట్టుకుందని ఇందుకు నిదర్శనం డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుచేయడమేనని ఆయన పేర్కొన్నారు. తొలుత పార్టీ కార్యాలయం ఆవరణంలో టిడిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద వున్న ఎన్‌టిఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి , కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి బి.హరిప్రసాద్, నగర కార్యదర్శి హరీంద్రనాధ్, సీనియర్ నాయకులు జి.లక్ష్మిరెడ్డి, టిడిపి ఫ్లోర్ లీడర్ విశ్వనాధరెడ్డి, మైనార్టీ నాయకులు అమీర్‌బాబు, సుభాన్‌బాష, జిలానీ తోపాటు నాయకులు జలతోటి జయకుమార్, సుబ్బరాయుడు, నాసర్ అలీ, పీరయ్యతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

పది పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా..

వేంపల్లె, మార్చి 29:పదవ తరగతి పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు చోటివ్వకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బండపల్లె ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఆయా కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు మాస్‌కాపీయింగ్‌ను కట్టడి చేయడం జరుగుతుందన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారని, దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడైనా మాస్‌కాపీయింగ్ జరిగే కేంద్రాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జీరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. ఈ ఏడాది కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కూడా పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట వేంపల్లె ఎంఇఓ వీరారెడ్డి, వేంపల్లె పిఎస్‌ఐ నాయక్ తదితరులున్నారు.

ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవం

కడప,(కల్చరల్)మార్చి 29: శాలివాహనుల (కుమ్మర్లు) అభివృద్ధికి నిరంతరం తన వంతు కృషి చేస్తానని శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జికె మునెయ్య పేర్కొన్నారు. స్థానిక మృత్యుంజయకుంటలోని శాలివాహన సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మునెయ్య మాట్లాడుతూ కుమ్మర, బ్రాహ్మణ సంగమ సంతాన ఫలమై యావత్తు ప్రపంచానికి చక్రవర్తిగా పాలించి ఘనకీర్తి పరుడు శాలివాహనుడు అన్నారు. ఆయన పేరునే ఈనాడు శాలివాహన శకం ఏర్పడిందని అంతటి వ్యక్తుల వారుసులమైన మనం ఐక్యతతో కులాభివృద్ధికి, రాజ్యాధికారం దిశగా పయనించి అత్యున్నత స్థాయికి కుమ్మరకులం ఎదగాలని పేర్కొన్నారు. అనంతరం రాయలసీమ రాష్ట్ర సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సక యుగ కర్త అయిన శాలివాహన చక్రవర్తి జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. శాలివాహన చక్రవర్తి జన్మవృత్తాంతాన్ని ఈసందర్భంగా ఆయన తెలిపారు. తొలుత శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి మునెయ్యతోపాటు అతిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటరామరాజు, సికెదినె్న మండల ఉపాధ్యక్షుడు బి.సాంబశివారెడ్డి, వెంకటరమణారెడ్డి, భాస్కర్, మునెమ్మ, శాంత పాల్గొన్నారు.

వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,మార్చి 29: రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, పారిశ్రామిక రంగానికి ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్ కెవి రమణ పేర్కొన్నారు. జిల్లాలో 2015-16 రుణ ప్రణాళిక కంటే 16.37శాతం అధికంగా 2016-17 సంవత్సరానికి వార్షిక ప్రణాళిక రూ.6860 కోట్లతో లీడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ మంగళవారం స్థానిక సభాభవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిలకడైన ఆర్థికవిధానాలతో రెండంకెల అభివృద్ధి లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో కూడా బ్యాంకర్లు మరింతగా ముందుకు వచ్చి వ్యవసాయ, వ్యవసాయేతర, పారిశ్రామిక, ఇతర ప్రాధాన్యత రంగాల వారికి రుణ సౌకర్యం కల్పించి లక్ష్యాన్ని అధిగమించేందుకు సహకరించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు ప్రాధాన్యత రంగాల్లో 91.04 లక్ష్యాలను సాధించడమైనదన్నారు. ఈనెలాఖరుకు పూర్తిలక్ష్యాలను సాధించడం జరుగుతుందన్నారు. ప్రాధాన్యత రంగాలకు అధిక ప్రాధాన్యతినిస్తూ 2016-17 సంవత్సరానికి రూ.5691.60 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఇది 2015-16సంవత్సరానికి కంటే 14శాతం అధికమని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 10.30 శాతం అధిక రుణ మంజూరు కేటాయించడమైనదన్నారు. వ్యవసాయపంట రుణాలు, పశుసంవర్దకశాఖ రుణాలకు 7.10 శాతం అధిక కేటాయింపు జరిగిందని చెప్పారు. ప్రాధాన్యత రహిత రంగాల్లో ఈ ఏడాది కేటాయించిన లక్ష్యాన్ని కంటే 29.49శాతం అధికంగా రూ.1168.40కోట్లు రాబోయే ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేయడానికి వార్షిక రుణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు ప్రభుత్వ పరంగా లబ్దిదారులకు రుణ సౌకర్యం కల్పించడంలో సహకరించినందుకు అభినందించారు. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియా, ఎల్‌ఢిఎం రఘునాధరెడ్డి, ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ ప్రసాద్, ఏపిజిబి రీజనల్ మేనేజర్ రాజశేఖరరెడ్డి, సిండికేట్ బ్యాంక్ ఏజిఎం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కడప జిల్లాలోని బాలికలను సంరక్షించుకునేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ కెవి రమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సభాభవన్‌లో జరిగిన చైల్డ్‌లైన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించిచందని ఇందులో కడప జిల్లా కూడా ఉందన్నారు. జిల్లాలో ఆపదలో ఉన్న పిల్లలను కాపాడటానికి 1098 ఎమర్జెన్సీ నాన్ సర్వీసును కేంద్రస్ర్తి శిశు సంక్షేమశాఖ, టెలికమ్యూనికేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారని, జిల్లాలో దీనిపై విస్తత్ర ప్రచారం కల్పించాలన్నారు. ప్రభుత్వశాఖలు, స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో 1098 ఎమర్జెన్సీ సర్వీసును వినియోగించుకుని ఆపదలో ఉన్న పిల్లలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జెసి శే్వత తెవతియా, డిఆర్‌ఓ సులోచన, ఐసిడిఎస్ పిడి రాఘవరావు, ఆర్తీ విజయ ఫౌండేషన్ ప్రతినిధి సంధ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మహిమాన్వితుడు అవధూత నారాయణరెడ్డిస్వాములవారు..

బ్రహ్మంగారిమఠం, మార్చి 29: అనేక రకాలైన మహిమలను చూపి ప్రజలకు దగ్గరై అవధూత స్వాములవారిగా మారిన వారిలో శ్రీశ్రీశ్రీ అవధూత నారాయణరెడ్డి యోగీంద్ర స్వాములవారు ఒకరు. ఈయన కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలం మిట్టపల్లె గంగిరెడ్డిపల్లె అను గ్రామంలో జన్మించారు. ఈ మహా పురుషుడు చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విషయాలను రోసి, వాటి నుండి వేరై, అధ్వైత దృష్టితో తన మహత్యమును వెలిగించి తనను ఆశ్రయించిన భక్తులకు జ్ఞానోపదేశమొసంగి, వారిని పునీతులు గావించుచూ, అనేక ప్రదేశములలో సంచారమొనర్చుచుండిరి. జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో కందిమల్లాయపల్లె పురస్థితి శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి పరిసర ప్రదేశములన్నియు యోగి పుంగవులకును, భక్తాగ్రేసరుకులను నివాస యోగ్యమై ప్రసిద్ధిగాంచియున్నది అనుటలో అతిశయోక్తి లేదు. అట్టి మహనీయులలో శ్రీ నారాయణరెడ్డి అవధూత యోగీంద్ర స్వాములవారు ఒకరని చెప్పవచ్చు. స్వామివారు ఎక్కువగా కర్నూలుజిల్లాలో సంచారం చేయుచూ అనేకమంది ప్రజలకు జ్ఞానోపదేశమొనర్చియుండుట వలన ఈయనకు కర్నూలు నారాయణరెడ్డిస్వామి అని కూడా పేరు వచ్చినదని పెద్దలు చెబుతారు. ఇటి మహా యోగిపుంగవులు కడప మండలమున ప్రవేశించి యోగి పుంగవులకు స్థానమిదియని తలంచి శ్రీ ఆనందనామ సంవత్సరం పాల్గుణ బహుళ పక్షమున కందిమల్లాయపల్లెకు దక్షిణ దిశన నాల్గు కిలోమీటర్ల దూరంలో వుండే ఓబులరాజుపల్లె గ్రామానికి వచ్చారు. అప్పటి గ్రామాధికారి, రాజయోగియు అయిన బొమ్ము వీరారెడ్డిగారి ఆతిధ్యము స్వీకరించి కొంతకాలం ఆశ్రయం పొందిన స్వామివారిన అనేకమంది భక్తులు వారివారి గ్రామాలకు రావలయునని ప్రార్థించారు. ఆ భక్తులకు తగిన సమాధానం నొసంగిన స్వాములవారు అక్కడే సమాధినిష్ట వహించదలచి శ్రీ ఆనందనామ సంవత్సరం పాల్గుణ బహుళ ద్వాదశి శుక్రవారం నాడు భౌతిక దేహం చాలించి, మహా సమాధి పొందారు. నాటి నుండి నేటి వరకు బొమ్ము వీరారెడ్డిగారి కుటుంబ వారసులు, వారి సంతతి స్వాములవారి ఆరాధనను ప్రతి ఏడాది జరిపిస్తున్నారు. అందులో భాగంగానే స్వామివారు చూపిన మహిమలలో కొన్ని స్వామివారు కడపజిల్లాకు రాదలచి రైలులో ప్రయాణించు సమయంలో తనిఖీ అధికారులు స్వామివారిని టిక్కెట్టు అడుగగా స్వామి నుంచి ఎటువంటి సమాధానము రాకపోగా రైలు నుండి స్వామివారిని అధికారులు స్టేషన్‌లో దింపినట్లు పెద్దలు చెబుతారు. స్వామివారు ఆయన ధోరణిలో టిక్కెట్టు లేకుండా దిక్కట్టే కదరా అని అనుకుంటూ రైలు దిగి దగ్గరలోని చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వామి రైలు దిగినప్పటి నుంచి రైలు కదలక ఆగిపోయినది. ప్రయాణీకులలో కొందరు పెద్దలు మీరు యోగిని దించారు కనుకే రైలు కదలలేదని, అందరూ కలిసి స్వామివారిని రైలు ఎక్కమని వేడుకున్నారు. అంతటితో స్వామి సమ్మతించి తిరిగి రైలు ఎక్కగా అక్కడి నుంచి రైలు బయలుదేరింది. ఇటువంటి మహిమలు, మహత్యాలు అనేకమున్నవని, ఇవి కేవలం మచ్చుకు మాత్రమేనని ఆయన భక్తులు చెబుతారు. ప్రస్తుతం స్వామివారు సమాధి అయిన ప్రాంతం బ్రహ్మంసాగర్‌లో మునిగిపోవడంతో స్వామివారి దేవాలయాన్ని బ్రహ్మంసాగర్ ఎడమ కాలువ వద్ద నూతనంగా, అత్యాధునికంగా నిర్వాహకులు నిర్మించారు. ఇక్కడ స్వామివారి 102వ ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మెన్ బొమ్ము శివనారాయణరెడ్డి తెలిపారు.
ఆరాధనా కార్యక్రమాలు : స్వామివారి 102వ ఆరాధనా మహోత్సవాలు ఏప్రిల్ 4,5వ తేదీలలో రెండురోజులపాటు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 4న శ్రీశ్రీశ్రీ అవధూత యోగీంధ్రనారాయణరెడ్డి స్వాములవారు సమాధినిష్ట వహించిన పవిత్రమైనరోజు. ఉదయం స్వామివారికి గణపతిపూజ, అభిషేకం, శ్రీ సత్యనారాయణస్వాములవారి వ్రతం, అనంతరం హోమాలు నిర్వహించబడును. ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు తిరుమలతిరుపతి దేవస్థానం హింధూధర్మప్రచార పరిషత్ వారిచే అన్నమాచార్య సంకీర్తన, హరికథా కాలక్షేపం, భజన కార్యక్రమాలు, రాత్రికి తెలుగుగంగ కాలనీలోని రామాలయం నుండి జెండా మెరవణి శ్రీ స్వామివారి సన్నిధానమునకు బయలుదేరుతుంది. రాత్రి 10గంటలకు శ్రీమతి వేదవతి భాఘవతారిణిచే హరికథా కాలక్షేపం. 5వ తేదీ మంగళవారం తెల్లవారుజాము 4గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మైదుకూరు, బద్వేలు డిపోల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలలో మునె్నల్లి, బాకరాపేట, గుడిపాడు, పెద్దచియ్యపాడు, కలసపాడు, నరవ, భీమలింగాయపల్లె, చిన్నాయిపల్లెలకు చెందిన బ్యాండ్ బృందములచే కచ్చేరీలు నిర్వహించబడుతాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

4 నుండి అన్నమయ్య
513 వర్ధంతి ఉత్సవాలు
రాజంపేట, మార్చి 29:పద కవితా పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 513వ వర్ధంతి ఉత్సవాలను ఏప్రిల్ 4వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదవలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం రాజంపేట బోయనపల్లెలోని అన్నమయ్య 108 అడుగుల విగ్రహం, థీమ్ పార్కును టిటిడి చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రియభక్తుడైన అన్నమాచార్యులు రాసిన సంకీర్తనలకు దేశ, విదేశాలలో విశేష ఆదరణ లభించిందన్నారు. దీంతో అన్నమయ్య లేనిదే వెంకటేశ్వరస్వామి లేడు అన్నట్లుగా అన్నమయ్య కీర్తనలు దేశం నలుమూలల ప్రజల హృదయాలలో మెదులుతున్నాయన్నారు. అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన తాళ్లపాక, అన్నమయ్య థీమ్ పార్కులో ఘనంగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన అన్నమయ్య వేడుకలను నిర్వహించేందుకు ఎప్పుడు కూడా నిధుల కొరత రానివ్వమన్నారు. కడప-తిరుపతి ప్రధాన రహదారిలో ఇంతటి భారీ విగ్రహాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరూ సంతోషించదగ్గ విషయమన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులందరూ మొదట అన్నమయ్యను దర్శించుకుని వెంకటేశ్వరస్వామి పాదాల చెంతకు చేరుకోవడం శుభ పరిణామన్నారు. రాబోవు రోజులలో అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాకకు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ సుధాకర్‌రావు, డిప్యూటీ ఇఓలు ఎ.శారద, బాలాజీ, టిటిడి పిఆర్‌ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు.