అనంతపురం

‘కబాలి’ డా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూలై 22: కబాలి సినిమా విడుదల కావడంతో నగరంలోని సినిమా థియేట ర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా వివిధ భాషలలో భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైంది. దీంతో అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాశారు. నగరంలో శాంతి, గౌరి థి యేటర్లతో పాటు ఇతర థియేటర్లలో కూడా శుక్రవారం కబాలి సినిమాను ప్రదర్శించారు. సినిమా చూడటం కో సం అభిమానులు ఉదయానే్న పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకున్నారు. టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు. శాంతి థియేటర్‌లో సరికొత్త టెక్నాలజీతో నగరంలో మొదటి సారి గా యుఎఫ్ 2కె సౌండ్‌సిస్టం ద్వారా సినిమాను ప్రదర్శించా రు. ఈవిధానం ద్వారా పిక్చర్ క్వాలిటీ, లైటింగ్, సౌండ్ సిస్టం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని థియేటర్ మేనేజర్ తెలిపారు. సినిమా ప్రదర్శన అనంతరం బయటకొచ్చిన ప్రేక్షకులు సినిమా తామనుకున్న రేంజ్‌లో లేదని, యావరేజ్‌గా ఉందని తెలిపారు.