అనంతపురం

జల దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 25:వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తోటి రైతుల వేరుశెనగ పంటను కాపాడేందుకు సమీపంలోని ఫారంపాండ్స్ నుంచి రెయిన్ గన్స్ ద్వారా రక్షక తడులను అందించడానికి నీటిని దానం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 65 వేల మంది రైతులు అంగీకరించారని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమం సందర్భంగా జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు సరిపడా రెయిన్ గన్లను మంజూరు చేశారని, వీటిని మండలాల వారీగా గోడౌన్లలో భద్రపర్చాలని వ్యవసాయ శాఖ జెడి శ్రీరామమూర్తి, ఎపిఎం ఐపి పిడి వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆయిల్ ఇంజన్లు, తగినంత పొడవున పైప్‌లైన్ల సామగ్రిని కూడా ఇచ్చేలా కస్టమ్ హైర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఎన్ని రెయిన్ గన్లు, ఆయిల్ ఇంజన్లు, పైపు లైన్లు అవసరమో కార్యచరణ ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన రూపొందించి సమర్పించాలన్నారు. తోటి రైతులకు నీటి తడులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. వారి బోర్లకు సమీపంలోని ఫారంపాండ్లను జత చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, ఇంకా మిగిలిన పనుల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జేడిఎ, డ్వామా పీడీలను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌ను కలెక్టర్ ఆదేశించారు.
ఈ-ఆఫీస్ తప్పనిసరి
జిల్లాలో ఇకపై వంద శాతం ఈ-ఆఫీస్‌ను ప్రతి జిల్లా అధికారి తప్పనిసరిగా అమలు చేసి, ఫైల్స్‌ను ఈ విధానం ద్వారానే తనకు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులందరినీ కలెక్టర్ ఆదేశించారు. ఈ పద్ధతిలో పారదర్శకతతో పాటు ఫైల్స్ పరిష్కారం వేగవంతమవుతుందన్నారు. అలాగే సిబ్బందిలో బాధ్యతాయుతాన్ని పెంచుతుందన్నారు. కాగా ఈ నెల 29న కోటి వనమహోత్సవం, కొండ పండుగలను విజయవంతంగా నిర్వహించాలని, జిల్లాలో ఒకే రోజున 10 లక్షల మొక్కలు నాటడానికి అన్ని చర్యలను పకడ్బందీగా చేపట్టాలని డిఎఫ్‌ఓ చంద్రశేఖర్, జెడ్పీ సిఈఓ రామచంద్ర, డిపిఒ, నెడ్‌క్యాప్ డిఎం, డిఈ ఓలతో పాటు జిల్లా అధికారులందరినీ కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవాన్ని పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంను కోరారు. కాగా జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ఎంపికైన 329 గ్రామాల్లో 1.73 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. జిల్లాధికారులు, ఎంపిడీఓలతో సమన్వయం చేసుకుని వీటి నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అలాగే ప్రజా సాధికార సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, ఇన్‌చార్జి డిఆర్‌ఓ మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు.