అనంతపురం

రైల్వే టెండర్లలో సిండికేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూలై 25:గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిర్వహించిన టెండర్లలో నాయకులు సిండికేట్‌లు ఏర్పడి రైల్వే ఆదాయానికి గండి కొట్టారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రూ.25 కోట్లతో ముదిగుబ్బ, రేణిగుంట, గూడురు స్టేషన్‌ల పరిధిలో నూతనంగా ఆర్‌యుబి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. అదే విధంగా గుంతకల్లు-వాడి సెక్షన్‌ల నడుమ బ్యాలెస్ట్ పనులకు మరో రూ.5కోట్లతో టెండర్లను నిర్వహించారు. ఈసందర్భంగా గుత్తి, గుంతకల్లు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్‌లు టెండర్లను దక్కించుకోవడానికి వచ్చారు. స్థానిక నాయకుల సహకారంలో సిండికేట్‌గా ఏర్పడి కాంట్రాక్టర్‌లు అధిక ధరలకు షెడ్యూళ్లను దాఖలు చేయడంతో రైల్వేకు పెద్దఎత్తున గండి పడింది.