అనంతపురం

వందకోట్లతో పర్యాటక అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జూలై 26: రూ.100 కోట్ల తో రాయలసీమలో పర్యాటక శాఖ అ భివృద్ధికి కృషి చేయనున్నట్లు కర్నూలు డివిజనల్ మేనేజర్ సుదర్శన్‌రావు, డిఈ ఈశ్వరయ్యలు తెలిపారు. మంగళవారం కేంద్ర పర్యాటక శాఖ ముఖ్య అధికారులు కందా, అనీల్ కె.గుప్తలు పుట్టపర్తిలో పర్యటించారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, కార్యదర్శి ప్రసాదరావుతో వారు సంప్రదింపులు జరిపారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న పుట్టపర్తి కేంద్రంగా రూ.6 కోట్లతో సౌండ్ అండ్ లేజర్ షో ఏర్పాట్లపై వారు చర్చించారన్నారు. సత్యసాయి భక్తులు, దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ సౌండ్ అండ్ లేజర్ షోను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. సత్యసాయి భక్తి గేయాలు, ఆయన చేసిన బోధనలు, సేవా కార్యక్రమాలను ఈ షో ద్వారా ప్రసారం చేసి భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కల్గించే విధంగా రూపొందించడం జరుగుతోందన్నారు. త్వరలో వాటి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. చిత్రావతి నది సుందరీకరణ పనులు రూ.3 కోట్ల నిధులతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఏడాదిలోగా వాటిని పూర్తి చేస్తామన్నారు. శిల్పారామంలో మరో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పెనుకొండ జాతీయ రహదారిలో కుంభకర్ణ, హరిపురం వద్ద రూ.2 కోట్లతో పర్యాటకరంగ ఆధునిక రెస్టారెంట్ నిర్మిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో అవుకు రిజర్వాయర్‌లో బోట్ క్లబ్ ఏర్పాటుచేస్తామన్నారు. బనగానపల్లి వద్ద బెలూం గుహలు సందర్శించే పర్యాటకులకు తగిన వౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందుకు కేంద్ర పర్యాటక శాఖ సైతం సహకరించేందుకు ముందుకొచ్చిందన్నారు. రూ.100 కోట్లతో రాయలసీమ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వారు పేర్కొన్నారు.