అనంతపురం

కలహాల కాపురాలకు చక్కని పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 12 : పలు సమస్యలతో తమ వద్దకు వచ్చే బాధితులకు స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కారం చూపుతున్నామని కుటుంబ సహకార కేంద్రం డిఎస్పీ డి.మహబూబ్‌బాషా అన్నారు. జిల్లా కేంద్రంలో కుటుంబ సహకార కేంద్రం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమస్యలకు కారణాలు, వచ్చిన కేసులు, పరిష్కారానికి నోచుకున్న కేసులు, ఏఏ వయస్సుల వారు వస్తున్నారు వంటి విషయాలపై ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో శనివారం ముఖాముఖి మాట్లాడారు.
ప్రశ్న : కుటుంబ సహకార కేంద్రం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం?
జవాబు : ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలతో కొంతమంది వ్యక్తులను ఆశ్రయించడం వల్ల అవి మరింత పెరుగుతున్నాయి. అదే సమయంలో వారు చేసిన పంచాయితీలు సైతం నిలబడడం లేదు. అందుకే ఏ కుటుంబంలోనైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకే పోలీసులు, ఐసిడిఎస్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబంలో సమస్యలు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఇది ఒక నూతన ఒరవడి .. వారి సమస్యలు పరిష్కారమైన తర్వాత కూడా మానిటరింగ్ చేస్తున్నాం.
ప్రశ్న : ఇప్పటివరకూ ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్ని పరిష్కరించారు? ఎన్ని కేసులు నమోదు చేశారు?
జవాబు : ఇప్పటివరకూ 610 పిటీషన్లు వచ్చాయి. ఇందులో 25 కేసులు నమోదు చేయగా మరో 30 పెండింగులో ఉన్నాయి. ఇక మిగిలిన 555 కేసులను కౌనె్సలింగ్ ద్వారా పరిష్కరించాం.
ప్రశ్న : ఎలాంటి కేసులు మీ వద్దకు వస్తుంటాయి?
జవాబు : ఒకటని చెప్పలేం. పలు రకాల సమస్యలు, అనుమానాలు, అపార్థాలు, ఇగోలతో కూడిన పిటిషన్లు వస్తున్నాయి. ఉదాహరణకు వివాహితలను తీసుకుంటే.. భార్యపై అనుమానం, అక్రమ సంబంధం, ఇగో, భార్య అంటే చిన్నచూపు, అదనపు కట్నం కోసం ఒత్తిడి, అత్తమామల వేధింపులు వంటివి ఉంటున్నాయి. ఇక వివాహితుని వైపు నుంచి భార్య కనీస మర్యాద ఇవ్వకపోవడం, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడటం, ప్రతిపనినీ అనుమానించడం, ఫోన్లు, ఈ మొయిల్స్ చూసి ఎంక్వయిరీ చేయడం, ప్రతి విషయంలో తల్లితండ్రుల ప్రమేయం, ఇక భార్యాభర్తల వ్యక్తిగత విషయాలను తల్లితండ్రులు, మిత్రులతో చర్చించడం లాంటివి ఉంటున్నాయి. ఇలా భార్యాభర్తల వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించడం అన్న ఫిర్యాదులే సుమారుగా 40 శాతం వరకూ ఉన్నాయి.
ప్రశ్న : ఏఏ వయస్సు వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
జవాబు : ఇప్పటి వరకూ వచ్చిన కేసుల్లో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న భార్యాభర్తలే అధికంగా ఉన్నారు. ఇలాంటి వారు సుమారుగా 60 శాతం వరకూ ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కేసులు 12 రాగా ఐదు మినహా అన్నింటినీ కౌనె్సలింగుల ద్వారానే పరిష్కరించాం. ఇక డాక్టర్లకు సంబంధించి పది కేసులు రాగా ఒకటి మినహా అన్నీ పరిష్కరించాం.
ప్రశ్న : కౌనె్సలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?
జవాబు : ఒక సమస్య మా వద్దకు రాగానే దాని మూలాల్లోకి వెళ్తాం. ఇందుకు ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరినీ పిలిపించి మాట్లాడుతాం. దీనివల్ల సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందన్న విషయం పూర్తిగా తెలిసిపోతుంది. పలు దఫాలుగా వారితో సమావేశమవుతాం. అనంతరం భార్యాభర్తలను కూర్చొబెట్టి సమస్య ఎక్కడ నుంచి వస్తుందో చెబుతూ, వివాహ బంధం, పవిత్రత, ఆవశ్యకత, సమాజం, వారి పాత్ర వంటి అంశాలను కూలంకషంగా వివరిస్తాం. ఇందుకు నాలుగు నుంచి 20 వరకూ కౌనె్సలింగులు చేసిన కేసులు సైతం ఉన్నాయి.
ప్రశ్న : ఇలాంటి కేసుల్లో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు?
జవాబు : ఒత్తిళ్లు అన్నవి సర్వసాధారణం.. రకరకాల ఒత్తిళ్లు వస్తూనే ఉంటాయి. ఎవరు ఎన్ని తెచ్చినా మా వైపు నుంచి ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్న తాపత్రయం తప్పించి ఏమీ ఉండదు. ఇక కొన్నికొన్ని కేసుల్లో వారికి అనుకూలంగా వ్యవహరించలేదని కొంతమంది మమ్మల్ని బెదిరించిన సందర్భాలూ అనేకం. ఇలాంటి ఉద్యోగాల్లో ఇవన్నీ సర్వసాధారణం. అయినా ముందుకు వెళ్తుంటాం.
ప్రశ్న : ఈ కొత్త బాధ్యత ఎలా అనిపిస్తోంది?
జవాబు : నాకు ఈ బాధ్యత పూర్తి సంతృప్తి ఇస్తోంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఒక గ్రామాన్ని నిలబెట్టినట్టేనని పెద్దలు చెప్పేవారు. ఒక కుటుంబం ఎలాంటి సమస్యలూ లేకుండా ఉంటే సమాజానికి ఒక మంచి తరాన్ని అందించిన వారవుతారు. ఇక్కడా అదే ఫాలో అవుతున్నాం. మా స్థాయితో ఏ మాత్రం సంబంధం లేకుండా అందరూ ఒకే తాటిపై ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం.
ప్రశ్న : భార్యాభర్తలు, యువతకు మీరిచ్చే సలహా?
జవాబు : భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే ఇగోలకు పోయి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల సలహాలు పాటించి వివాహ బంధానికి దూరం కావద్దు... సమస్యలు లేని మానవులు ఉండరు... సమస్య వచ్చినపుడు మూలాలను సహనంతో తెలుసుకుని వ్యవహరించాలి.. అప్పుడే ఎలాంటి సమస్యలూ ఉండవు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
* మంత్రి పరిటాల సునీత
ధర్మవరం రూరల్, డిసెంబర్ 12: ప్రజా సంక్షేమమే టిడిపి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం జన చైతన్య యాత్రలో భాగంగా పట్టణంలోని 19, 20, 22 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జిల్లా కరవును పారదోలే విధంగా హంద్రీ నీవాను పూర్తి చేసి త్వరలోనే చెరువులను నింపుతామన్నారు. అలాగే రూ.600 కోట్లతో ఫారంపాండ్ల నిర్మాణం చేపట్టామని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రధానంగా ఎన్నికల్లో చేసిన హామీల మేరకు రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు సంఘానికి రూ.1లక్ష, రేషన్ కార్డుల్లో బియ్యం కోటా పెంపు, పింఛన్ ఐదు రెట్లు పెంపకం, 24గంటల విద్యుత్ అందించి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత అభివృద్ధి చేసినా కొందరు విమర్శిస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రథమంగా మన రాష్ట్రంలోనే నదుల అనుసంధానం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు ఒక్కరేనన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా బ్యారేజ్‌కు కృష్ణా, తుంగభద్ర జలాలు హంద్రీ నీవాకు మళ్ళిస్తారని, హంద్రీనీవా అతి త్వరలోనే పూర్తి అవుతుందని, జిల్లా సస్యశ్యామలం కాబోతోందన్నారు. అనంతరం స్థానిక పిఆర్‌టి వీధిలో మహిళా స్వయం శక్తి సంఘం భవనంలో మెప్మా ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, వైస్ చైర్మన్ అంబారపు శ్రీనివాసులు, పలువురు తెలుగుదేశం నాయకులు, కౌన్సిలర్లు, కమిషనర్ రామ్మోహన్, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
సత్వర న్యాయమే
మెగా లోక్ అదాలత్ ధ్యేయం
* జిల్లా జడ్జి సుబ్రమణ్యకుమార్
అనంతపురం సిటీ, డిసెంబర్ 12: కక్షిదారులకు సత్వరం న్యాయ పరిష్కారం అందించడమే మెగా లోక్ అదాలత్ ధ్యేయమని జిల్లా జడ్జి పి.సుబ్రమణ్యకుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారుల ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జి ల్లా జడ్జి మాట్లాడుతూ కేసులు సత్వరం పరిష్కారం కావడంతో పాటు ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈ లోక్ అదాలత్‌ను ఉపయోగించుకుని కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో తమ కేసులను పరిష్కారం చేసుకోవాలన్నారు. జిల్లాలో 36,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఇందులో 3 వేల కేసులకు పైగా ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరించామన్నారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ రాజీ ద్వారా పరిష్కారం కాదగిన కేసులన్నింటిని పరిష్కరించుకోవాలన్నారు. ఇందుకు తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. దేశంలో ధర్మం నాలుగు పాదాలు మీద నడుస్తుందంటే ఇందుకు మన న్యాయ వ్యవస్థే అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ హేమసాగర్, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి, 3వ అదనపు జిల్లా జడ్జి సునీల్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్‌నాయుడు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.