అనంతపురం

పరిశ్రమల ఏర్పాటుతోనే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, జూలై 28 : పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లాలో ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి హేమసాగర్ అన్నారు. ఇందులో భాగంగానే హిందూపురం రూరల్ మండల పరిధిలోని గోళ్లాపురం సమీపంలో 381.75 హెక్టార్లలో రూ.465.51 కోట్లతో ఏపిఐఐసి ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తే కలిగే ఇబ్బందులు, పర్యావరణ తదితర అంశాలపై గోళ్లాపురం పారిశ్రామికవాడలో పర్యావేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ ఇప్పటికే తూమకుంట పారిశ్రామిక వాడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వం మరో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పారిశ్రామిక వాడ వల్ల ఈ ప్రాంతంలో ఆర్థిక స్థాయి పెరగనున్నట్లు తెలిపారు. దీనికితోడు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతుల కోసం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ సంస్థ అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రసాద్‌రావు మాట్లాడుతూ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో పర్యావరణం అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో ఇలాంటి పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రామ్మూర్తి, ఎపిఐఐసి జనరల్ మేనేజర్ రంజిత్‌కుమార్, మేనేజర్ చంద్రశేఖర్, సోని, తహశీల్దార్ విశ్వనాథ్ పాల్గొన్నారు.