అనంతపురం

మానవ మనుగడకు చెట్లే మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లురూరల్, జూలై 28 : మానవ మనుగడకు ప్రధానమైన మొక్కలను ప్రతి ఒక్కరూ విరివిగా నాటి సంరంక్షించాలని మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమంపై గురువారం పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు మహార్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రితోపాటు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కోడెల అపర్ణ జెండాను ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ అపోలో సర్కిల్, పాత బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా గాంధీ విగ్రహం వరకూ సాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు లేక కరవు కాటకాలతో ప్రజలు సతమతమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వనం-మనం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మొక్కల పెంపకం వల్ల వర్షాభావ పరిస్థితులు, వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. జిల్లాలో 615 కొండలుండగా 25 కొండల్లో శుక్రవారం దాదాపు 10.40 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా మూడు సంవత్సరాల కాలంలో 20 కోట్ల మొక్కలను నాటి హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా 7 కోట్ల మొక్కలకు తగ్గకుండా నాటి పూర్తిస్థాయిలో సంరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించడంలో గుంతకల్లు ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బండారు ఆనంద్, కౌన్సిలర్లు కృపాకర్, లక్ష్మీనారాయణ, టిడిపి పట్టణ కార్యదర్శి ముక్కన్నగారి రామాంజినేయులు, సహాయ కార్యదర్శి గుజిరీ మహమ్మద్ ఖాజా, కోడెల చంద్రశేఖర్, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ సత్యనారాయణరాజు, తహశీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు.