అనంతపురం

పైసలిస్తేనే ప్రసవాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, జూలై 28: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పుకు వచ్చిన వారికి డబ్బులు ఇస్తేనే కాన్పులు చేస్తామని, అత్యవసరమైతే తనకు చెందిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురావాలని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు డిమాండ్ చేసిందంటూ గర్భిణీల బంధువులు గురువారం ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన జమీల అనే గర్భిణీ ఐదు రోజుల క్రితం నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేరిందని, గురువారం ఆపరేషన్ థియేటర్‌లోకి కాన్పు కోసం తీసుకెళ్లి మత్తు డాక్టర్ లేడని, తన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొస్తే సిజేరియన్ చేస్తానని, లేనిపక్షంలో అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ చెప్పడంతో ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. ఇదే సందర్భంలో తనకల్లు మండలం గొల్లవారిపల్లికి చెందిన కవిత, నల్లచెరువు మండలం కమ్మవారిపల్లికి చెందిన శ్రీదేవిలు కూడా కాన్పుకు రాగా డబ్బులు ఇస్తేనే కాన్పులు చేస్తామని ఆ వైద్యురాలు తమను డిమాండ్ చేసిందని జమీల బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. అయితే ఆసుపత్రి వర్గాలు స్పందించకపోవడంతో ఆసుపత్రి ఎదురుగా వున్న రోడ్డుపై బైఠాయించి గర్భిణీలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్న తాము తమ పిల్లల పురుడు కోసం ప్రభుత్వాసుపత్రికి రావడం జరిగిందన్నారు. అయితే పేదవారమని కూడా చూడకుండా నాలుగు రోజుల నుండి రక్తం ఎక్కించి కాన్పులు చేయకుండా డబ్బుల కోసం తమను ఇబ్బందిపెడితే డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలని వారు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని కూడా ఇలా పేదలను ఇబ్బంది పెట్టడమేంటని వారు ప్రశ్నించారు. రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐలు జయపాల్‌రెడ్డి, రాజేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రామక్రిష్ణను అక్కడికి పిలిపించి మాట్లాడించి, ఆయన హామీపై రాస్తారోకో విరమించారు.