అనంతపురం

తాడిపత్రిలో ఇసుక దందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిమర్రి, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక రవాణాకు అవసరమైన లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనే ఆలోచనకు కొందరు ఉచితం మాటున అక్రమ ఇసుక దందా హవా నడిపిస్తున్నారు. మండలంలోని చిత్రావతి నది సమీపంలో తిరుమలాపురం యేటి నుండి ప్రతి దినం వేకువజాము నుండి దొడ్డిదారుల్లో 20 ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. తాడిమర్రిలో పోలీసుల కళ్లు కప్పి దొడ్డిదారుల్లో గత మూడు, నాలుగు రోజులుగా విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తుండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దందాపై స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు నోరు మెదపకుండా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డదారుల్లో రాత్రివేళ ఇసుక తరలిస్తున్న పలువురు దళారులు అక్కడక్కడ చిన్నపాటి డంపులు వేసుకుని పట్టణాలకు ఇసుక అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ ఇసుక దందాపై స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి ఆపకపోతే ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోపాటు ప్రభుత్వం అందించే ఉచిత ఇసుక పంపిణీ పథకం సైతం నీరుగారుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు మండలంలో ఉచితం మాటున జరిగే అక్రమ ఇసుక దందాను నివారించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.
సిఎం సమక్షంలో
టిడిపిలో చేరిన కాంగ్రెస్, వైకాపా నేతలు
రొళ్ల, మార్చి 31 : మండలంలోని కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. బుధవారం సాయంత్రం దాదాపు 15 వాహనాల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు జడ్పీటీసీ విఎం పాండురంగప్ప, మండల పార్టీ కన్వీనర్ రవిభూషణ్‌ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా హైదరాబాద్‌లోనే ఉన్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న నాయకులను ముఖ్యమంత్రికి పరిచయం చేసి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరూ సద్వినియోగం చేసుకోనేలా చూడాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని సిఎం తెలియజేసినట్లు మండల కన్వీనర్ రవిభూషణ్ ఫోన్ ద్వారా తెలిపారు. టిడిపిలో చేరిన వారిలో హులికుంట నాగరాజు, మాజీ సర్పంచ్ రత్నగిరిబాబు, సూర్యప్రకాష్‌రావు, సుబ్బన్న, సన్న ఎంజారప్ప, తిప్పన్న, బోడప్ప, విజయకుమార్, నాగరాజు, ఉగ్రప్ప, రామప్పలతోపాటు దాదాపు 150 మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఎండిపోతున్న ‘పల్లె’ సంకల్పం!
* నీరులేక వాడుతున్న మొక్కలు
నల్లమాడ, మార్చి 31: జిల్లా వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు నాటిన మొక్కలన్నింటికి గుక్కెడు నీళ్లు పోసే వారు ఎవరూ పట్టించుకోక పోవడంతో మంత్రి నాటిన మొక్క ఆకులన్నీ నేలరాలి ఎండుకట్టెలా నిలిచాయి. పుట్టపర్తి నియోజకవర్గాన్ని హరితపర్తిగా మార్చాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి గత ఏడాది అక్టోబర్ 13న నల్లమాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి అధికారులందరితో సమావేశాన్ని నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రతి మండలం పచ్చని చెట్లతో కళకళలాడాలని నియోజకవర్గ వ్యాప్తంగా 3 లక్షల మొక్కల పెంపకానికి నాంది పలికారు. అవసరమైతే మొక్కలు కర్ణాటక రాష్ట్రం నుంచైనా తెప్పించాలని ఆ రోజు అటవీ శాఖాధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం అధికారులందరూ మొక్కలు నాటే పనిని ప్రారంభించే పనిలో అప్పట్లో చాలా బిజీగా గడిపారు. 2015 అక్టోబర్ 15న అమరావతి నిర్మాణ పనుల్లో విజయవాడలో చాలా బిజీగా వున్నప్పటికీ మంత్రి హాజరై నల్లమాడలోని అప్పయ్యగారిపల్లి దారిలో ఆర్భాటాల నడుమ మొక్కలను నాటి నీళ్లు పోశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ మొక్కలను నాటారు. అన్ని మండలాల్లో అప్పట్లో నాటిన మొక్కల్లో కనీసం 10శాతం మొక్కలు కూడా ప్రస్తుతం బతక లేదనే చెప్పుకోవచ్చు. మొక్క చుట్టూ వేసిన ముళ్ల కంచెలు మాత్రం మిగిలి మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో మంత్రి చేబట్టిన హరిత సంకల్పం పూర్తిగా ఎండుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా కూడా జిల్లా వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలనైతే నాటారు. దాంతోపాటు కొన్ని మండలాల్లో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగే విధంగా మండలస్థాయి అధికారులకు జిల్లా అధికారులు ఆదేశించారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లను సరఫరా చేసినట్లు బిల్లులైతే స్వాహా చేశారుగానీ నీళ్లు పోసేవారు లేక నాటిన వాటిలో 95శాతం మొక్కలు పూర్తిగా మాత్రం ఎండిపోయాయి. కరవు జిల్లాగా పేరొందిన అనంత జిల్లాను హరిత జిల్లాగా మార్చి తీర్చాలన్న విధానంలో మొక్కలు నాటే ప్రక్రియ ప్రధానమైంది. కాగా ఆర్భాటాల మధ్య మొక్కలు నాటే కార్యక్రమాలు చేబడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారగణం నాటిన ఆ మొక్కలు బతికిబట్టకట్టాయా అనే కనీస పర్యవేక్షణ చేయకపోవడం అనంత జిల్లా హరిత అనంతగా మారేనా అన్నది ప్రశ్నార్థకమే...

ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలి
* స్వర్ణకారుల ఆందోళన
అనంతపురం సిటీ, మార్చి 31: స్వర్ణకారులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వాలకు మంచి బుద్ధి ప్రసాదించాలని గురువారం నగరంలో స్వర్ణకారులు అర్ధనగ్న ప్రదర్శన, మానవహారం నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసారు. మొదట స్వర్ణకారులు, కార్మికులు నగరంలోని బంగారు బజారు నుండి తాడిపత్రి బస్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిపిఐ, స్వర్ణకార కార్మిక, వర్తక సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గత 29 రోజులుగా స్వర్ణకారులు తమ పొట్టకొట్టవద్దని శాంతియుతంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టినప్పటికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అ న్యాయమన్నారు. 1960 సంవత్సరంలో ఎక్సైజ్ సుంకాన్ని అప్పటి ప్రభుత్వం విధిస్తే భారీ ఎత్తున స్వర్ణకారులు ధర్నాలు నిర్వహించడం జరిగిందని, అప్పటి ప్రభుత్వం చొరవ తీసుకొని స్వర్ణకారులకు న్యాయం చేశారన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం స్వర్ణకారుల కడుపుకొట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్వర్ణకారులకు, కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి లింగమయ్య, అల్లీపీరా, స్వర్ణకార కార్మిక, వర్తక సంక్షేమ సంఘం నాయకులు మున్సూర్, వన్నప్పచారి, మహబుబ్ బాషా, రసూల్‌సాబ్, శ్రీనివాసచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
* నలుగురికి గాయాలు.. తప్పిన పెను ప్రమాదం
బుక్కరాయసముద్రం, మార్చి 31: బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44 వడియంపేట పంచాయతీ పరిధిలోని రాంనగర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిమేకలపల్లి బాగేపల్లి మండలం చిక్‌బళ్ళాపూర్‌కు చెందిన లారీ డ్రైవర్ చంద్రశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల మేరకు.... తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఆర్టీసి బస్సు 6మంది ప్రయాణికులతో వెళ్తుండగా వడియంపేట రాంనగర్ సమీపానికి వచ్చే సరికి దున్నపోతు బస్సుకు అడ్డం వచ్చింది. ఆర్టీసి బస్సు డ్రైవర్ బ్రేకు వేయగా కర్నాటకకు చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుండి గోధుమలు ఎత్తుకొని హొసుర్‌కు వెళ్తున్న తరుణంలో బస్సు వెనుకనే వేగంతో వస్తున్న లారీ బస్సును ఢీకొనడంతో బస్సు రహదారి డివైడర్ పై పల్టీ పడింది. లారీ రోడ్డుకు ఎడమ పక్క ఉన్న అంగన్‌వాడీ పాఠశాల ఆవరణలోకి దూసుకువెళ్ళింది. బస్సులో ఉన్న నలుగురి ప్రయాణికులు, కండెక్టర్, డ్రైవర్‌తో కలిపి 6మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఆర్టీసి డ్రైవర్ నల్గొండ జిల్లా నకిరేకల్లుకు చెందిన లింగమయ్య(40) తలకు గాయం కాగా మరో ప్రయాణికుడు గోదావరికని కరీంనగర్ జిల్లాకు చెందిన అబ్ధుల్ (33) గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రీనివాసులు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. దిగూర్, చిక్‌బళ్ళాపూర్‌కు చెందిన లారీ క్లీనర్ గిరీష్(24) కూడా తీవ్ర గాయాలై అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు స్థానిక సర్పంచ్ సుబ్బరాయుడు, స్థానికులు క్రాంతి, అంజి, విఆర్‌ఎ రామాంజి, మరికొందరు మానవతా దృక్పథంతో ప్రమాదంలో చిక్కుకుపోయిన క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును బుక్కరాయసముద్రం పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి బాలుడి మృతి
కదిరిటౌన్, మార్చి 31: మండల పరిధిలోని కాళసముద్రంలో బావిలో పడి మహ్మద్ (6) అనే బాలుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుకుంది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంలో మన్సూర్ పంచర్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను తన కుమారుడు మహ్మద్‌కు ఈత నేర్పేందుకు గ్రామంలోనే వున్న వ్యవసాయ బావి వద్దకు బుధవారం తీసుకెళ్లాడు. బావి దగ్గరకు వెళ్లగానే ఫోన్ రావడంతో కుమారుని తీసుకొని ఇంటికి వచ్చి షాప్ వద్దకు వెళ్లిపోయాడు. అయితే ఆ బాలుడు తిరిగి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తెలియనితనంతో బావిలోకి దూకేశాడు. కుమారుడు కనిపించకపోవడంతో మన్సూర్ బంధువులతో కలిసి గ్రామంలో గాలించాడు. అనుమానం వచ్చి బావిలో కూడా గాలించగా కుమారుడు ఆచూకీ తెలియలేదు. దీంతో గురువారం ఉదయం మరోసారి స్థానికులతో కలసి బావిలో వెతకగా మహ్మద్ శవమై కనిపించాడు. పట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కదిరిటౌన్, మార్చి 31: కదిరి రూరల్ పరిధిలోని నడిమిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలచంద్ర(45) మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు. నడిమిపల్లికి చెందిన తిమ్మప్ప కుమారుడు బాలచంద్ర బుధవారం రాత్రి బహిర్భూమి కోసం రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా వుండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వడదెబ్బతో ఒకరి మృతి
చెనే్నకొత్తపల్లి, మార్చి 31: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మేడాపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన రామలింగయ్య(65) ఉగాది పండుగను పురస్కరించుకుని ఇల్లు శుభ్రపరిచే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ఉన్నఫలంగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికంగా వున్న వైద్యుని వద్దకు తీసుకెళ్ళారు. చికిత్స అనంతరం ఇంటి వద్దకు రాగానే మృత్యువాతపడ్డాడు.