అనంతపురం

కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 2 : జిల్లా కేంద్రంలోని పిటిసి స్టేడియంలో నిర్వహించనున్న రాష్టస్థ్రాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా కనుల పండువగా విజయవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంద్రాగస్టు వేడుకల నిర్వహణకు ఓవరాల్ ఇన్‌చార్జిగా జెసి బి.లక్ష్మీకాంతంను నియమించామన్నారు. రాష్టస్థ్రాయి అధికారులను సమన్వయం చేసుకుని స్వాతంత్య్ర దినోత్సవంలో శకటాల ఫ్యాబ్రికేషన్ పనులను వెంటనే మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే 3వేల మంది విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చూడాలని డిఇఓ అంజయ్యను, ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణంలోని ట్రాఫిక్ ఐల్యాండ్స్‌ను, వేడుకలు జరగనున్న పిటిసి స్టేడియంను విద్యుదీపాలతో శోభాయమానంగా అలంకరించాలని మున్సిపల్ కమిషనర్, ఆర్‌అండ్‌బి ఎలక్ట్రికల్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పిటిసి స్టేడియం లో 10 స్కై బెలూన్‌లు ఏర్పాటు చే యాలని డ్వామా పిడి నాగభూషణం ను ఆదేశించారు. అనంతరం హెలిప్యా డ్, వేదిక నిర్మాణ పనులు, మైక్ సి స్టమ్, ఎల్‌ఇడి స్క్రీన్స్ తదితర పనుల ను నిర్వహించేందుకు వివిధ కమిటీల ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ఇన్‌చార్జి డిఆర్‌ఓ మల్లీశ్వరి, ట్రాన్స్ కో ఎస్‌ఇ ప్రసాద్‌రెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, సమాచార శాఖ ఏడి పి.తిమ్మప్ప పాల్గొన్నారు.