అనంతపురం

పకడ్బందీగా యుపిఎస్సీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, ఆగస్టు 2: యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7న యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జెఎన్‌టియు సెంటర్ ఎ, సె ంటర్ బి, కెఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఎస్‌బిఎన్ డిగ్రీ కళాశాల, కెఎస్‌ఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, యస్కే యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఎస్‌ఎస్‌బిఎన్ జూనియర్ కళాశాల మొత్తం 9 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులు 26 మందికి ఎస్‌ఎస్‌బిఎన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ప్రత్యేకంగా కేటాయించామన్నారు. పరీక్షలకు మొత్తం 3,553 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. పేపర్-1 ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంటముందు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు సక్రమంగా ఉన్నాయా లేదా ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఈసమావేశంలో జెసి-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ డా.వినోద్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.