అనంతపురం

పక్కాగా సర్వే ఎఫ్‌ఎంబి డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 7: భూమలు సర్వేకు సంబంధించి ఎఫ్‌ఎంబి (్ఫల్డ్ మెజర్‌మెంట్ బుక్) డిజిటలైజేషన్ పనులు పక్కాగా, వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ సిబ్బందికి సూచించారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయ సముదాయంలో ఉన్న భవనంలో జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఎఫ్‌ఎంబి డిజిటలైజేషన్ ప్రక్రియను ఆదివారం ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే శాఖ కమిషనర్ వాణీమోహన్‌తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4.50 లక్షల మ్యాన్యువల్ ఎఫ్‌ఎంబి రికార్డుల్లో ఇప్పటి వరకు 49,264 రికార్డుల్ని డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్‌తో కమిషనర్ అన్నారు. గత రెండున్నర నెలల నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో మొత్తం 235 మంది పాల్గొంటున్నారన్నారు. 113 మంది ఇప్పటికే శిక్షణ పొందిన వారు డిజిటలైజేషన్ చేస్తున్నారని, మిగిలిన 122 మంది ఈనెల 15 నాటికి శిక్షణ పూర్తి చేసుకుంటారని అన్నారు. వారంతా ఈనెల 16 నుంచి డిజిటలైజేషన్‌లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా రజిత అనే ఉద్యోగితో కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు ఎన్ని రికార్డుల్ని డిజిటైలేజేషన్ చేస్తారని అడిగారు. ఆటో క్యాడ్ విధానంతో రోజుకు 25 మ్యాన్యువల్ రికార్డులను డిజిటైలేజేషన్ చేస్తామని ఆమె వివరించారు. నెల జీతం ఎంత ఇస్తారని కలెక్టర్ అడగ్గా.. రూ.12 వేలు ఇస్తారని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ మలోలా, అనంతపురం తహశీల్దార్ శ్రీనివాసులు, డిజిటైజేషన్ చేస్తున్న ఆపౌశాక్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు మేనేజర్, సైంటిస్ట్ డాక్టర్ రఘు, టీమ్ లీడర్లు విశ జ్యోతి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.