అనంతపురం

వర్షం కోసం ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 9 : వర్షం ముఖం చాటేయడంతో జిల్లా రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. వాన రాకపోవడంతో పం టలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం చెనే్నకొత్తపల్లిలో కేవలం 0.6 మి.మీ. గరిష్టం గా వర్షపాతం నమోదైంది. గతనెల లో 67.4 మి.మీ. వర్షపాతం సగటున కురవాల్సి ఉండగా, నెలాఖరుకు మొత్తం 102.8 మి.మీ. కురిసింది. దీంతో అదనంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈనెలలో గతైడాదిలో 88.7 మి.మీ కురిసింది. ఈఏడాది మాత్రం ఆగస్టు మొదలై 9 రోజులు దాటినా కేవలం 2.7 మి.మీ. మాత్రమే కురిసింది. ఇదే తేదీకి సగటున 21.0 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కాగా జూన్‌లో సైతం 63.9 మి.మీ. సగటు వర్షపాతానికి 94. 5 మి.మీ. కురిసి, 47.9 మి.మీ. అదనంగా వర్షపాతం నమోదైంది. ఇది కూడా సకాలంలో వచ్చిన వర్షమేమీ కాదు. నెలంతా ఒక్కోసారి మోస్తరుగా, భారీగా కురవడంతో నమోదైన వర్షపాతమే. ఇదే పరిస్థితి ఈనెల కూడా ఎదురయ్యేలా ఉంది. ఇప్పటికే ముందస్తు వేరుశెనగ సాగు చేసిన రైతులు సకాలంలో వర్షం రాకపోతే తమ పంట పోతుందని, పూత దశ దాటిపోతే ఇబ్బంది పడతామని ఆందోళన చెందుతున్నారు. పూత వచ్చిన పంటకు వర్షం తగినంత లేకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దీంతో రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.