అనంతపురం

జీడిపల్లి చేరిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, ఆగస్టు 11: రాయలసీమ వరప్రదాయిని హంద్రీనీవా కాలవ ప్రాజెక్ట్ కాలవల ద్వారా కృష్ణా జలాలు గురువారం తెల్లవారుజామున జీడిపల్లి జలాశయానికి చేరుకున్నాయి. ఈ నెల 5న మాళ్యాలలో కృష్ణా జలాలు హంద్రీనీవాకు విడుదల చేయడంతో గురువారం ఉదయం హంద్రీనీవా ప్రాజెక్ట్ ఎస్‌ఇ సుధాకర్‌బాబు, ఇఇ నారాయణ నాయక్, డిఇ మురళీధర్‌రెడ్డి, పంప్‌హౌస్ డిఇ ఉమామహేశ్వర్, ఎఇ రామచంద్రరావు, తహశీల్దార్ వెంకటాచలపతి, ఆర్ జగన్నాద్, వేదపండితులు జయన్నస్వామి కృష్ణా జలాలకు పూజలు చేసి స్వాగతించారు. ప్రస్తుతం జీడిపల్లిలో 0.66 టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సీజన్‌లో రిజర్వాయర్‌కు 20 నుండి 25 టిఎంసీల నీటిని తీసుకురావడానికి అనుమతినిచ్చిందన్నారు. వీటితో పిఎబిఆర్, సిబిఆర్ డ్యాంలకు నీటిని విడుదల చేస్తామన్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కుంటలకు కూడా నీటిని విడుదల చేస్తామన్నారు. అలాగే రెండవ విడత పనులను సెప్టెంబర్ 17 కు పూర్తిచేసి మడకశిరలోని గొల్లపల్లి, చెర్లపల్లి, మారాల రిజర్వాయర్ల వరకు కృష్ణా జలాలు తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లికార్జున, పెద్ద తిప్పయ్య, శాన్స్ క్లబ్ అధ్యక్షులు ఈశ్వరప్ప, గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.