అంతర్జాతీయం

ఉగ్రవాదులకు పాక్ స్వర్గ్ధామం * అమెరికా పునరుద్ఘాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 13: తాలిబన్ ఉగ్రవాదులు, హక్కానీ నెట్‌వర్క్‌కు పాకిస్తాన్ ఇప్పటికీ సర్గ్ధామంగా ఉందని అమెరికా సైనిక జనరల్ మార్క్ ఏ మిల్లీ ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలకు పాక్ సహకరించినంత కాలం ఆఫ్గనిస్తాన్‌లో శాంతి నెలకొల్పడం కష్టంతో కూడుకున్నదేనని పెంటగాన్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థలతో అంటగాగుతున్న పాక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ఆర్థిక ఆంక్షలు విధించారు. ఎలాంటి సైనిక సహకారం అందించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు బిలియన్ల అమెరికా డాలర్ల సాయం నిలిపివేయనునన్నట్టు అమెరికా ప్రకటించింది. ఇన్ని రకాల ఆంక్షలు, దిగ్బంధనలు కొనసాగిస్తున్నపటికీ పాక్ తన బుద్ధి మార్చుకోవడం లేదని అమెరికా సైనిక ప్రధానాధికారి మిల్లీ విరుచుకుపడ్డారు.‘పొరుగుదేశంలో ఉగ్రవాద కార్యకలాపలు కొనసాగుతూ పోతే హింసను ఆపడంలో సంక్లిష్టంతో కూడుకున్నదే. ఇదే విషయాన్ని పాక్‌కు అనేక సార్లు స్పష్టం చేసినా మార్పురావడం లేదు’అని ఆయన నిప్పులు చెరిగారు. ఆఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనలో పాక్ భాగస్వామి కావల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. పాక్ తన వైఖరిని మార్చుకోవాలని లేనిపక్షంలో అవే ఉగ్రవాద సంస్థలకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.