అంతర్జాతీయం

సిరియాపై మెరుపు దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 14: అంతర్వుద్ధంతో అల్లాడుతున్న సిరియాపై అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు మెరుపు దాడులు చేశాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ రసాయనిక దా డులకు వ్యతిరేకంగానే తామీ ప్రతికార చర్యలు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సిరియాను నేరాల రాక్షసుడిగా అభివర్ణించిన ట్రంప్ ఫ్రాన్స్, యూకేతో కలిసి సం యుక్త దాడులు చేసినట్టు వెల్లడించారు. అసద్ ఆటవిక, క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరియాపై మరిన్ని వైమానిక దాడులు చేయాలని సంకీర్ణ దళాలను ట్రంప్ ఆదేశించారు. దౌమాలో జరిగిన రసాయన దాడుల్లో డజన్లకొద్దీ జనం మరణించారని ఆయన వెల్లడించారు. డమస్కస్‌లోని తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సిరియా చేపట్టిన దాడులు అత్యంత పాశవికమైనవే కాకుండా రాక్షస చర్యలుగా అమెరికా అభివర్ణిచింది. శనివారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ సిరి యా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై నిప్పులు చెరిగారు. అమాయక ప్రజలపై రసాయన దాడులు ఆపేవరకూ అసద్‌పై తమ వత్తి డి కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ‘అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించాయి. మేం అనుకున్న లక్ష్యాలను చేరుకున్నాం. సిరియాను దారిలోకి తేవడానికి మున్ముందు మరిన్ని దాడులు చేస్తాం’ అంటూ ట్రంప్ ప్రకటించారు. అధ్యక్షుడు అసద్ రసాయనిక ఆయుధాలతో అమాయక ప్రజలను బలితీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దౌమా లో గత శనివారం నాటి దాడులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాగా తాజా దాడుల్లో అనేక రసాయనిక ఆయుధాలు ధ్వంసం చేసినట్టు ఫ్రాన్స్ ప్రకటించింది.