అంతర్జాతీయం

ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వుహాన్, ఏప్రిల్ 28: రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులేయాలని భారత్- చైనాలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా సమాచార సరఫరాను బలోపేతం చేసుకుంటూ, ఒకరిపట్ల మరొకరు నమ్మకాన్ని వృద్ధి చేసుకునేలా ఇరు దేశాల మిలటరీలకు వ్యూహాత్మక దిశానిర్దేశం చేయాలని నిర్ణయించినట్టు భారత విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా ఆత్మీయ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరిపిన అనధికార చర్చల సారాంశాన్ని ఆయన వివరించారు. గత కొంతకాలంగా భారత్- చైనాల మధ్య తలెత్తిన ‘డోక్లాం’ తరహా ఉద్రిక్త పరిస్థితులు భవిష్యత్‌లో తలెత్తకూడదన్న ఉద్దేశమే పై నిర్ణయానికి కారణమన్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిపిన చర్చల్లో ప్రధాని మోదీ ప్రధానంగా భారత్- చైనా సహకారానికి ప్రతిబంధకంగా మారుతోన్న ప్రాంతాలపైనే దృష్టి పెట్టారని వివరించారు. ‘ఆర్థికాంశాలకే ఇరు దేశాలు పరిమి తం కాకుండా, ప్రజలమధ్య బాంధవ్యానికీ ప్రేరణ కలిగించే మార్గాలపైనా రెండు దేశాలు చర్చించాయి. వీటితోపాటుగా వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం, పర్యాటక రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకరించుకునేలా చర్చలు సాగాయి’ అని వివరించారు. చైనాలో ప్రధాని మోదీ రెండు రోజుల స్నేహపూర్వక పర్యటన ముగిసిన నేపథ్యంలో, చర్చల సారాంశాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని భారత్- చైనాలు తమ సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొల్పే చర్యలపై దృష్టి పెట్టనున్నాయన్నారు. ‘డోక్లాం తరహా ఉద్రిక్తతలు మరోసారి తలెత్తకుండా సరిహద్దు వ్యవహారాల్లో స్నేహపూర్వక నియంత్రణ పాటించేలా మిలటరీకి దిశానిర్దేశం చేయాలి’ అని ఉభయ పక్షాలూ నిర్ణయించాయన్నారు. ఈ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతలను ప్రత్యేక ప్రతినిధులకు అప్పగించాలని నిర్ణయించారు. 3,488 కిలోమీటర్ల పొడవునవున్న వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి వివాదాలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఇరు పక్షాల మధ్య 20రౌండ్ల చర్చలు జరిగినట్టు గోఖలే వెల్లడించారు. గత ఏడా ది రెండు దేశాల మధ్య 73 రోజులపాటు తలెత్తిన సరిహద్దు ప్రతిష్టంభన ఉద్రిక్తతలు మోదీ, జిన్‌పింగ్ మనసువిప్పి మాట్లాడుకున్న ఆత్మీయ చర్చలతో రూపుమాసినట్టేనని గోఖలే అభిప్రాయపడ్డారు. భా రత్-చైనాల పూర్వపు బంధాన్ని పరిరక్షించుకునే దిశగానే ఇరువురి నేతల మధ్య సున్నితమైన, బాధ్యతాయుతమైన, ఆశావాహక చర్చలు సాగాయని గోఖలే వివరించారు. ఉమ్మడి ఆసక్తులపై ఉభయ పక్షాలూ పరస్పర నమ్మకంతో బలమైన అడుగులు వేయాలన్న నిర్ణయం ప్రపంచ సంక్షేమంపట్ల ఇరు దేశాల బాధ్యతను స్పష్టం చేస్తోందని గోఖలే అన్నా రు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని సంయుక్తంగా, సమర్థంగా ఎదుర్కోవడానికి ఇరువురు నేతలూ అంగీకారానికి వచ్చినట్టు గోఖలే వెల్లడించారు. ఉగ్రవాద నిరోధక చర్చల్లో జైషే-ఇ-మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయం ప్రస్తావనకు వచ్చిందా? అన్న ప్రశ్నకు ‘ప్రత్యేకంగా ఏమీ రాలేదు’ అని సమాధానమిచ్చారు. ఇక వర్తక వాణిజ్య రంగాల్లో ఇ రు దేశాలూ సమతుల్యత పాటించాలని కోరుకుంటూనే, చైనాకు ఔషధ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రాధాన్యతను ప్రధాని మోదీ ప్రస్తావించారని గోఖలే వివరించారు. అదే సమయంలో జిన్‌పింగ్ సైతం ‘ఇరుగు పొరుగు దేశాలైన చైనా- భారత్ మధ్య స్నేహబంధం మరింత పరిఢవిల్లాల ని, ప్రపంచ గమనాన్ని మార్చగల శక్తులుగా రెండు దేశాలు ఎదగాలి’ అని ఆకాంక్షించారన్నారు. ఇరు దేశాల మధ్య తలెత్తే చిన్న చిన్న ఇబ్బందులను చ ర్చల ద్వారా పరిష్కరించుకుంటూ, ద్వైపాక్షిక సం బంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయడానికి భారత్ -చైనాలు నిర్ణయించుకున్నట్టు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు.