అంతర్జాతీయం

అంగారకుడి లోతుల్లోకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ (అమెరికా), మే 5: అంగారకుడి ఆనుపానులు మరింత లోతుగా తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నడుంబిగించింది. భూమికి సుదూర ప్రాంతంలోని అరుణగ్రహం అంతరాంతరాలనూ అధ్యయనం చేయడానికి తాజాగా ఇన్‌సైట్‌ను ప్రయోగించింది. ఇన్‌సైట్‌తో అంగారకుడి ఉపరితలాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాదు, అంగారక కంపనాల (మార్స్ క్వేక్స్) శబ్దాలను సైతం వినొచ్చని నాసా శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 4.05 గంటలకు చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ అట్లాస్ వి రాకెట్ నాసా ఇన్‌సైట్‌ను తీసుకుని బయలుదేరింది. దీన్ని అమెరికా పశ్చిమతీరం నుంచి నాసా చేపట్టిన తొలి ఇంటర్‌ప్లానెటరీ ప్రయోగంగా చెబుతున్నారు. అంగారకుడి ఉపరితలంపైనే కాదు, అంగారకుడి పైపొరల నుంచి 16 అడుగుల లోతుల్లోని ఉష్ణోగ్రతల పరిస్థితులను మరింత లోతుగా తెలుసుకునే అవకాశం దక్కుతుంది. అమెరికా, ఐరోపాలు సంయుక్తంగా 993 మిలియన్ల అమెరికన్ డాలర్లతో ఇన్‌సైట్ ప్రాజెక్టును చేపట్టడం తెలిసిందే. వందల వేల సంవత్సరాల క్రితమే భూమిలాంటి శిలాగ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోడానికీ ఇన్‌సైట్ ప్రయోగం ఉపకరిస్తుందని అంటున్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రయాణం సజావుగా సాగితే వచ్చే నవంబర్ 26నాటికి అరుణగ్రహంపై ఇన్‌సైట్ ల్యాండ్ అవుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇన్‌సైట్ ప్రయోగం అనంతరం నాసా చీఫ్ సైంటిస్ట్ జిం గ్రీన్ మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ మార్స్‌మీద బలమైన కంపనాలు, హిమపాతాలు, ఉల్కాపాతాలు చోటుచేసుకుంటున్న విషయానే్న తెలుసుకున్నాం. కానీ, వాటి సంభవానికి కారణాలేమిటన్న అధ్యయనాలు ఇన్‌సైట్ నుంచి మొదలవుతున్నాయి. మార్స్‌ని మరింత లోతుగా చూడాలంటే, కంపన సంభవాలపై ప్రాథమిక సమాచారం తప్పనిసరి. అందుకోసమే ఈ ప్రయోగం’ అన్నారు. నిజానికి ఇన్‌సైట్ ఉపగ్రహాన్ని 2016లోనే నాసా ప్రయోగించాల్సి ఉంది. ప్రయోగానికి ముందు చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపించటం, కీలక భాగమైన సిసిమో మీటర్ సామర్థ్యంపై అనుమానాలు తలెత్తడంతో అప్పట్లో ప్రయోగాన్ని నిలిపివేశారు.