అంతర్జాతీయం

రోహింగ్యాల సమస్యకు చర్చలతోనే పరిష్కారం: చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 28: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా నలుగుతున్న బంగ్లాదేశ్ రోహింగ్యాల సమస్యకు రాజకీయ వేదికపై చర్చలే సరైన పరిష్కారమని చైనా అభిప్రాయపడుతోంది. అయితే, ఈ సమస్యపై ఏకపక్ష ఆరోపణలు చేయడం, ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలు ఏమాత్రం పనిచేయవని చైనా పేర్కొంది.
రోహింగ్యా ముస్లింల మారణహోమానికి బాధ్యులైన మిలటరీ అధికారులు, ఆర్మీ అధికారులపై దర్యాప్తునకు ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసిన వెంటనే చైనా విదేశీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. రోహింగ్యాల సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని చైనా అభిప్రాయపడింది. బౌద్ధమతానికి కేంద్రంగా విరాజిల్లుతున్న మయన్మార్ దేశంలో గత ఏడాది 700,000 రోహింగ్యా ముస్లిం ఆందోళనకారులను అణచివేయడానికి ఆర్మీ దాడులకు దిగింది. ఈ మారణహోమానికి సాక్ష్యంగా వేలాదిమంది క్షతగాత్రులు అయ్యారు. ఎందరో మహిళలను సైనికులు విచక్షణారహితంగా బలాత్కరించడంతోపాటు హతమార్చారు. ఎంతోకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న రోహింగ్యా ముస్లింల సమస్యకు కేవలం రాజకీయ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హుయా చున్‌యింగ్ తెలిపారు. బంగ్లాదేశ్, మయన్మార్‌లలో శాంతిసౌభ్రాతృత్వాలు వెల్లివిరియడానికి మరిన్ని చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.