అంతర్జాతీయం

అథ్లెటిక్స్‌లో రెండు స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 30: అంతర్జాతీయ అథ్లెటిక్స్ రంగంలో అంతంత మాత్రంగా ఉండే భారత్ ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్నది. గురువారం అథ్లెటిక్స్‌లోనే రెండు స్వర్ణాలను దక్కించుకోవడం విశేషం. పురుషుల 1,500 మీటర్లపరుగులో జిన్సన్ జాన్సన్ స్వర్ణాన్ని సాధించాడు. మహిళల 4న400 మీటర్ల రిలే జట్టు కూడా భారత్ ఖాతాలో ఒక స్వర్ణాన్ని చేర్చింది. ఈ ఏషియాడ్‌లోనే, పురుషుల 800 మీటర్ల పరుగులతో రజతాన్ని కైవసం చేసుకున్న జాన్సన్ 1,500 మీటర్ల పరుగులో పెరుగైన ప్రదర్శనను కొనసాగించాడు. స్వర్ణమే లక్ష్యంగా పరుగుతీసి, లక్ష్యన్ని 3:44.72 నిమిషాల్లో చేరుకొని విజేతగా నిలిచాడు. ఇరాన్ అత్లెట్ అమీర్ మొరాడీ (3:45.62 నిమిషాలు), బెహ్రైన్ అథ్లెట్ మహమ్మద్ డియోలీ (3:45.88 నిమిషాలు) వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు. 800 మీటర్ల రేస్‌లో స్వర్ణాన్ని సాధించిన మన్జీత్ సింగ్ 1,500 మీటర్ల పరుగులో అనూహ్యంగా విఫలమై, నాలుగో స్థానంతో సంతృప్తి చెందాడు.
పురుషుల 4న400 మీటర్ల రిలేలో భారత్‌కు రజత పతకం దక్కింది. ధరుణ్ అయ్యసామి, కున్హు మహమ్మద్, రాజీవ్ అరోకియా, మహమ్మద్ అనాస్‌తో కూడిన భారత రిలే జట్టు ద్వితీయ స్థానంతో సంతృప్తి చెంది, రజతానికి పరిమితమైంది.
మహిళల 400 మీటర్ల రిలేలో ఎంఆర్ పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్, హిమా దాస్, విస్మయ సభ్యులుగా ఉన్న భారత జట్టు స్వర్ణ పతకం గెల్చుకుంది. ఇలావుంటే, మహిళల 1,500 మీటర్ల పరుగులో పీయూ చిత్ర, మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో సీమా పునియా కాంస్య పతకాలను అందుకున్నారు.
కాగా, మొత్తం మీద భారత్ అథ్లెటిక్స్‌లో ఇప్పటి వరకూ 8 స్వర్ణం, పది రజతం, 2 కాంస్యాలతో మొత్తం 20 పతకాలను ఖాతాలో వేసుకోవడం విశేషం.