అంతర్జాతీయం

హిజ్‌బుల్ మిలిటెంట్ల ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాశ్మీర్‌లో ఐదుగురు టెర్రరిస్టుల ఎన్‌కౌంటర్ ఘర్షణల్లో ఐదుగురు పౌరులు మృతి
శ్రీనగర్, మే 6: జమ్మూకాశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో టాప్ కమాండర్‌తోపాటు ఈమధ్యే రిక్రూట్ అయిన ఓ వర్శిటీ ప్రొఫెసర్ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో అల్లరి మూకలు పోలీసులపై దాడులకు దిగిన ఘటనల్లో ఒక పౌరుడు మృతిచెందాడని పోలీసులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని జైనపోర ప్రాంతం బడిగాం గ్రామంలో మిలిటెంట్లు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మిలిటెంట్లు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ‘షోఫియాన్ జిల్లా బడిగాం గ్రామంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హిజ్‌బుల్ ముజాహిదీన్ మిలిటెంట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి’ అని పోలీస్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, మిలిటెంట్లను గుర్తించాల్సి ఉందని ఆయన అన్నారు. 24 గంటల క్రితమే ఇక్కడకు సమీపంలోని చట్టబల్ పట్టణం నడిబొడ్డున ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, మృతిచెందిన మిలిటెంట్లలో హిజ్‌బుల్ టాప్ కమాండర్ సద్దాం పడ్డెర్, కాశ్మీర్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ రఫీ భట్ సహా తౌసీఫ్ షేక్, ఆదిల్ మాలిక్, బిలాల్ అలియాస్ మోల్విలు ఉన్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. కాశ్మీర్ యూనివర్శిటీ సోషియాలజీ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్న భట్ శుక్రవారం నుంచీ అదృశ్యమైనట్టు కాశ్మీర్ ఐజీ ఎస్పీ పాణి వెల్లడించారు. తొలుత అతని కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు భట్ ఆనుపానులు తెలియడంతో కుటుంబం సహా అతని నక్కిన ప్రాంతానికి వెళ్లి లొంగిపొమ్మని హెచ్చరికలు జారీ చేశామని పాణి తెలిపారు. అతని నుంచి స్పందన లేకపోవడంతో ఎన్‌కౌంటర్ చేయక తప్పలేదన్నారు. మిలిటెంట్లు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక సైనికుడికి స్వల్పంగా గాయాలయ్యాయని పాణి వెల్లడించారు. అలాగే ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి తిరుగుబాటు సాహిత్యం, భారీగా ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నట్టు ఐజీ వివరించారు. అయితే, ఎన్‌కౌంటర్ వివరాలు తెలియడంతో హిజ్‌బుల్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై రాళ్లదాడికి దిగడంతో, అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనల్లో ఆందోళనకారులతోపాటు, కొందరు స్థానికులు గాయపడ్డారు. అల్లరి మూకలపైకి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆసిఫ్ ఆహ్మద్ మీర్ అనే కణతలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానిక ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. అలాగే మరో నలుగురు పౌరులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కాశ్మీర్ వర్శిటీలో ఎలాంటి అలజడి తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు. అలాగే సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు వర్శిటీ యంత్రాంగం ప్రకటించింది. మధ్య, దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్‌ను స్తంభింపచేశారు.