అంతర్జాతీయం

భారత్‌కు రండి.. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాగ్యూ, సెప్టెంబర్ 7: భారత రక్షణ రంగం అవసరాలకు అనుగుణంగా పరికరాల తయారీ సంస్థల ఏర్పాటుకు ముందుకు రావాలని రాష్టప్రతి రామ్ నాథ్‌కోవింద్ చెక్ దేశ రక్షణ కంపెనీలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ ఆయన చెక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్‌తో సమావేశమై ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ధి అంశాలపై చర్చించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చెక్ దేశంలోని సంస్థలను రాష్టప్రతి కోరారు. ఈ వివరాలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్-చెక్ దేశాల మధ్య ఐదు అంశాలపై అవగాహన ఒప్పందం కుదిరంది. సిఐఎస్‌ఐ, చెక్ అకాడమి ఆఫ్ సైనె్సస్ మధ్య ఒప్పందం ఖరారైంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి, ఈఎల్‌ఐ బీమ్ లైన్స్ మధ్య లేసర్ టెక్నాలజీ అంశంపై కూడా ఎంఓయూ కుదిరింది. రాష్టప్రతి మాట్లాడుతూ చెక్ దేశానికి రక్షణ రంగంలో అత్యంత ఆధునిక పరికరాలు తయారు చేసే నైపుణ్యం ఉందన్నారు. చెక్‌లో అతి పెద్ద రక్షణ సంస్థ స్కోడా ఆటో, వోక్స్‌వ్యాగన్ సంస్థలు ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిందని రాష్టప్రతి పేర్కొన్నారు. వచ్చే నెలలో భారత్-చెక్ జాయింట్ కమిషన్ మధ్య చర్చలుజరగనున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య దశాబ్ధాలుగా సంబంధాలు ఉన్నాయని, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగంలో విరివిగా పెట్టుబడులుపెట్టాలని కోరారు.చెక్ అధ్యక్షుడు జెమన్ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సౌహార్థ్ర సంబంధాల మెరుగుదలకు విశేషంగా కృషి చేస్తామని చెప్పారు. హెవీ ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ, పౌరవిమానయాన రంగంలో టెక్నాలజీ మార్పిడికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత్‌కు అత్యున్నత స్థాయి నిపుణులను పంపేందుకు ఒక సదస్సును ఏర్పాటు చేస్తామన్నారు. రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ బదులిస్తూ అణు ఇంధనాన్ని శాంతి ప్రయోజనాలకు కాపాడాలన్న ఐరాస ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించే ప్రసక్తిలేదని ఆయన చెప్పారు. భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థని ఆయన చెప్పారు. ఐరాస భద్రత మండలిలో భారత్‌కు శాశ్వత ప్రాతిపదికన సభ్యత్వం లభించాలన్న డిమాండ్‌కు చెక్ రిపబ్లిక్ మద్దతు ఇవ్వడాన్ని రాష్టప్రతిస్వాగతించారు.