అంతర్జాతీయం

కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ భారత రాయబారికి పాక్ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: సరిహద్దుల్లో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ పాక్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు అక్కడి అధికారులు మంగళవారం సమన్లు జారీచేసి నిరసన తెలిపారు. భారత సైన్యం జరిపిన కాల్పుల కారణంగా పాకిస్తాన్‌లోని ఓ గ్రామస్థుడు మృత్యువాత పడ్డారని తాఖీదుల్లో పాక్ పేర్కొంది. సార్క్, దక్షిణాసియా దేశాల డైరెక్టర్ జనరల్, పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నాడు సరిహద్దుల్లోని కంజార్ సెక్టార్‌లో భారత సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడి కాల్పులు జరిపి ఓ గ్రామ పౌరుని మృతికి కారణమైందని ఆరోపించారు. అందుకే భారత ఉప రాయభారికి సమన్లు జారీచేసి నిరసన తెలిపామన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఇప్పటి వరకు 2,050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఈ కారణంగా 33 మంది అమాయక పౌరులు మరణించారని, 122 మంది గాయపడ్డారని ఆరోపించారు. కేవలం 2017లో మాత్రమే భారత సైన్యాలు 1970 సార్లు ఒప్పందాలను ఉల్లంఘించాయని ఫైజల్ వివరించారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను, మానవతా విలువలను కాలరాసి భారత సైన్యం ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోందని,ప్రాంతీయపరమైన శాంతికి ఇది విఘాతమని ఆరోపించారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాలకు భారత్ కట్టుబడివుండాలని ఫైజల్ విజ్ఞప్తి చేశారు. అమెరికా రక్షణ మండలి (యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్) నిర్ణయం మేరకు ఆదేశపు సైనిక పరిశీలనా బృందాన్ని భారత్‌లోకి అనుమతించాలని ఫైసల్ కోరారు.

మళ్లీ మాట్లాడుకుందాం!
* అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఉత్తర కొరియా లేఖ
వాషింగ్టన్, సెప్టెంబర్ 11: అణు నిరాయుధీకరణ విషయంలో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య అత్యంత ఆర్బాటంగా జరిగిన చారిత్రక చర్చలు ముందుకు సాగకపోవడంతో అదే దిశగా మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ మరోసారి సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలి చారిత్రక చర్చలు మందకొడిగా మారిన నేపథ్యంలో ‘మళ్లీ మాట్లాడుకుందాం’ అంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ‘కిమ్ జోంగ్‌నుంచి అధ్యక్షుడికి లేఖ అందింది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం. అయితే ఆ లేఖ సారాంశాన్ని పూర్తిగా వివరించలేం గాని చాలా సానుకూలంగా ఉంది’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ సరా శాండర్స్ విలేఖరులకు తెలిపారు. ఈ లేఖపై అధ్యక్షుడు తక్షణమే స్పందించారు. ఈ అంశంపై మరింత కూలంకషంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై మళ్లీ తప్పనిసరిగా చర్చలు ఉంటాయని వెల్లడించారు. మొదటి సమావేశం అనంతరం ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదన్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. గతంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ పరస్పరం రెచ్చగొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ ఎట్టకేలకు శాంతించి ఈ ఏడాది జూన్‌లో సింగపూర్‌లో సమావేశమై శాంతి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా అధ్యక్షుడు గ్యాంగ్‌స్టర్‌లా వ్యవహరించారంటూ ఉత్తర కొరియా మీడియా విమర్శలు కురిపించింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందని అందరూ భావించారు. అయితే ఇటీవల ఉత్తర కొరియా 70వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్‌ను అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఉన్ అమెరికా అధ్యక్షుడికి లేఖ రాయడంతో అణు నిరాయుధీకరణపై మరింత సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.