అంతర్జాతీయం

పొరుగుకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనక్‌పుర్ (నేపాల్), మే 11: హిందువులకు అత్యంత పవిత్రమైన సీతామాత జన్మస్థలం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలతో ప్యాకేజీని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్-నేపాల్ మధ్య ప్రాచీన కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఈ బంధాన్ని విడదీయలేరని ఆయన ఉద్వేగంతో అన్నారు. భారత్‌కు అత్యంత సన్నిహితమైన దేశం నేపాల్ అని ఆయన ప్రశంసించారు. జనక్‌పుర్‌లో ప్రధాని మోదీకి పౌర సన్మానం జరిగింది. ఈ సంధర్భంగా ఆయన నేపాలీ, మైథిలీ భాషలో కొంత సేపు ప్రసంగించారు. తొలుత మోదీ జానకీ మాత ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జై శ్రీరాం అంటూ మూడు సార్లు నామ స్మరణ చేస్తూ నినదించారు. ‘ఈ పవిత్ర భూమికి నేను ప్రధానమంత్రి హోదా లో రాలేదు. ఒక యాత్రికుడిగా వచ్చాను ’ అని మోదీ అన్నప్పుడు ప్రజలు కరతాళ ధ్వనులు చేశారు. రామచరిత మానసలో శ్లోకాలను చదువుతూ, స్నేహితుడు బాధలో ఉంటే ఏకాకిగా వదిలిపెట్టి ఎలా ఉంటాం, నిజమైన స్నేహితుడిగా ఆ బాధలో పాలుపంచుకుంటాం’ అని ఆయన అన్నారు. సంక్షోభం ఎదురైనప్పుడుల్లా రెండు దేశాలు సమిష్టిగా వ్యవహరించాయన్నారు. జనక్‌పుర్ పరిసరాల అభివృద్ధికి వంద కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామన్నారు. అంతకు ముందు ఆయన నేపాల్ ప్రధానమంత్రి శర్మ ఓలితో కలిసి జనక్‌పుర్, అయోధ్య మధ్య బస్సు సర్వీసును ప్రారంభించారు. రామాయణ్ సర్క్యూట్‌లో జనక్‌పుర్ భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ రెండు నగరాలు హిందువులకు పవిత్రమైనవన్నారు. మతపరంగా ఈ రెండు నగరాలు పవిత్ర పర్యాటక ప్రాంతాలని చెప్పారు. రెండు దేశాల మధ్య అనుసంధానం ఏర్పడిందన్నారు. బౌద్ధం, జైన్ మతానికి సంబంధించి ఇరుదేశాల్లోని చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ మరో రెండు ప్యాకేజీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. దీని వల్ల యువతకు ఉపాధి చేకూరుతుందన్నారు. వాణిజ్యం, పర్యాటక, టెక్నాలజీ, సంస్కృతి రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటూ ముందుడుగు వేయాలన్నారు. నేపాల్‌ను జల రవాణాతో అనుసంధానం చేసేందుకు సహకరిస్తామన్నారు. దీని వల్ల విదేశాలకు నేపాల్ సరుకులు ఎగుమతి అయ్యేందుకు వీలవుతుందన్నారు. సీతామాత ఆశీస్సుల వల్ల తాను జనక్‌పుర్‌ను సందర్శించగలిగానన్నారు. చాలా సంవత్సరాలుగా తనకు ఈ నగరాన్ని సందర్శించాలని ఉందని చెప్పారు. త్రేతాయుగం నుంచి భారత్-నేపాల్ మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. నేపాల్‌లో పశుపతినాథ్ నుంచి భారత్‌లో రామేశ్వరం వరకు రామాయణ కాలం నుంచి ఉన్న ఇతిహాస, హైందవ బంధాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే లుంబిని, బుద్ధగయ మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన వివరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. యాజ్ఞవల్క్య, అష్టావక్ర, గార్గి లాంటి మహా రుషులు జన్మించిన ప్రదేశమని ఆయన నేపాల్ పవిత్రతను కొనియాడారు. నేపాల్ ఆధ్యాత్మిక రంగానికి కేంద్రమన్నారు. భారత్‌లోని రాక్సుల్ నుంచి ఖాట్మాండు వరకు రైల్వే మార్గాన్ని అనుసంధానం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జనక్‌పుర్‌లోని ప్రజలు యావత్తు భారతానికి స్వాగతం పలికారని ఆయన అన్నారు. నేపాల్ ప్రధాని శర్మ ఓలి బహుకరించిన మైథిలీ కుర్తాను మోదీ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేపాల్ రక్షణ శాఖ మంత్రి పోఖారిల్ మాట్లాడుతూ ఉమ్మడి సంస్కృతి, నాగరికత, చరిత్రను రెండుదేశాలు పంచుకున్నాయన్నారు. మోదీని జనక్‌పుర్ మేయర్ లాల్ కిష్రో షా సత్కరించి సన్మాన పత్రం చదివారు.