అంతర్జాతీయం

పరస్పర సహకారంతో మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వాణిజ్య, రక్షణ రంగాల్లో *ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం
బల్గేరియా, సెప్టెంబర్ 16: భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు విదేశీ పర్యటనలో భాగంగా శనివారం సెర్బియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఉసిక్‌తో భేటీ అయ్యారు. వాణిజ్య, రక్షణ, ఐటీ తదితర రంగాల్లో పరస్పర సహకారం బలోపేతం చేయడంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ప్రత్యేక ఆహ్వానంపై ఇక్కడికి వచ్చిన వెంకయ్య నాయుడును సెర్బియన్ ప్యాలెస్ వద్ద ఉసిక్ సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేకించి సవరించిన విమానయాన సర్వీసులు, పర్యావరణ పరిరక్షణలపై పరస్పర సహకారాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఇరు దేశాల ఆర్థిక స్థితిగతుల బలోపేతానికి ఈ అంగీకారం దోహదం చేయగలదని భారత ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆహారోత్పత్తులు, వ్యవసాయం, ఔషధాల తయారీ, రక్షణ రంగ పరిశ్రమలు, పర్యాటక, ఐటీ తదితర రంగాల ప్రగతికి సంబంధించి ద్వైపాక్షిక సహకారాలపై అలెగ్జాండర్ ఉసిక్, వెంకయ్యనాయుడు మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత-సెర్బియా దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వార్షికోత్సవాలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఇరు దేశాలకు చెందిన స్వామి వివేకానంద, నికోలా తెస్లాలతో కూడిన తపాలా స్టాంపును సైతం విడుదల చేయడం ఆనందంగా ఉందని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. నికోలాతెస్లా సెర్బియన్ అమెరికన్ శాస్తవ్రేత్తగా, ఇంజనీర్‌గా ప్రఖ్యాతిగాంచారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆధునీకరణ విషయంలో ఆయన సరికొత్త పరిశోధనాత్మక ఆవిష్కరణలెన్నో చేశారు. కాగా సెర్బియాలోని భారతీయులతో బెల్‌గ్రేడ్‌లో శుక్రవారం వెంకయ్య నాయుడు సమావేశంమై ఇష్టాగోష్టి జరిపారు. మాతృదేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నాయుడు ఈ సందర్భంగా ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు.