అంతర్జాతీయం

నెహ్రూ మాటలే స్వేచ్ఛకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్‌గ్రేడ్, సెప్టెంబర్ 16: ఎన్నోఏళ్ల క్రితం మన భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడ చారిత్రక ప్రసంగం చేశారని అది మనకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని భారత్ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. సెర్బియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి నెహ్రూ చేసిన ప్రసంగంలో స్వతంత్రత, చర్చ, న్యాయపాలన వంటి అంశాలు అంతర్గతీకరించడం ద్వారా రాజ్యపాలన పద్ధతులు మరింత పటిష్టం కావాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణించారన్నారు.
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినాన్ని పురస్కరించుకుని శనివారం వెంకయ్యనాయుడు సెర్బియా జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పలు అంశాలపై ఇరుదేశాలు ఒకేవిధమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ఎంతో చరిత్ర ఉందని, ఎంతోకాలంగా ఇరుదేశాల బంధం వేళ్లూనుకుని ఉందని ఆయన చెప్పారు. 1961లో ఇక్కడ మొట్టమొదటి అలీనోద్యమ సమావేశం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రపంచంలోని పలువురు ప్రముఖ నాయకులు ఇక్కడే ప్రసంగించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రతి దేశానికి స్వతంత్రం అవసరమని, ప్రతి జాతి తన సొంత వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని నాడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ వర్తిస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రంతో మనకు మరింత శక్తి వస్తుందని, దీనిద్వారా శ్రేయస్కరమైన సమాజం నిర్మితమవుతుందని ఆయన అన్నారు. ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సంస్కరణ విషయంలో భారత్ అభిప్రాయాలతో సెర్బియా ఏకీభవించడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. అలాగే అంతర్జాతీయంగా శాంతి, రక్షణ పెంపొందించడానికి ఉగ్రవాదం పెద్ద ఆటంకంగా మారుతోందని అన్నారు. దీనిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన ఏర్పాటు ఉండాలని ఆయన అన్నారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మెరుగుకు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం 200 యూఎస్‌డిల వాణిజ్యం జరుగుతోందని, వాస్తవ పరిస్థితులను బేరీజు వేస్తే ఇది చాలా తక్కువని, ఇరుదేశాల మధ్య ఇది మరింత పటిష్టం కావడానికి మరిన్ని చర్యలు అవసరమని వెంకయ్య నాయుడు అన్నారు. ఆర్థిక బంధాలు మరింత బలోపేతానికి ఇరుదేశాల మధ్య పెట్టుబడులు పెట్టుకోవాలని, ఒప్పందాలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవమని, ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి కావడం సంతోషం కలిగిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. ముఖ్యంగా 1961లో అలీనోద్యమం ప్రారంభం కావడానికి ఇది వేదిక కావడం చారిత్రకంగా గొప్ప విషయమని, ఆ ఉద్యమానికి భారత్, యుగోస్లేవియా మార్గదర్శకంగా నిలవడం మరువరానిదని ఆయన పేర్కొన్నారు.