అంతర్జాతీయం

విశ్వసనీయతే గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి, మే 21: భారత్-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధం మరింత కీలక ప్రాధాన్యతను సంతరించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నల్లసముద్ర తీర ప్రాంత నగరమైన సోచిలో సోమవారం సమావేశమైన మోదీ ‘రెండు దేశాల బంధానికి విశ్వసనీయతే గీటురాయి’ అని పేర్కొన్నారు. తాజాగా ఈ మైత్రి మరింత ఉన్నతిని సంతరించుకోవడం ఘన విజయమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారత్-రష్యాలు విడదీయలేని మైత్రీబంధంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్న ఆయన ‘ఈ రెండు దేశాల సుహృద్భావం సమున్నతం’ అని వ్యాఖ్యానించారు. తనతో లాంఛనంగా సమావేశమయ్యేందుకు ఆహ్వానించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ తాజాగా రెండు దేశాలూ తమ మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భావించడానికి ఇది సంకేతమన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రభుత్వాధినేతల మధ్య లాంఛనప్రాయమైన శిఖరాగ్ర సదస్సులన్నవి కొత్త ఒరవడికి నాంది పలుకుతాయని, దీనివల్ల మనసువిప్పి మాట్లాడుకునే అవకాశంతోపాటు అధినేతలు పరస్పరం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. 2011లో అప్పటి భారత ప్రధాని వాజపేయితో తాను రష్యా వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న మోదీ, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తాను కలుసుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ అని తెలిపారు. అలాగే తన రాజకీయ జీవితంలో రష్యాకు పుతిన్‌కు కూడా కీలకమైన ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. గుజరాత్ ప్రధానిగా తాను కలుసుకున్న తొలి విదేశీనేత పుతిన్ అయితే, తన అంతర్జాతీయ సంబంధాలు కూడా పుతిన్‌తోను, రష్యాతోనే మొదలయ్యాయని మోదీ పేర్కొన్నారు. గత 18 సంవత్సరాలుగా పుతిన్‌ను కలుసుకునేందుకు తనకు అనేక అవకాశాలు వచ్చాయని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించడంతోపాటు భారత్-రష్యా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశమూ దక్కిందన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బీజాలు నాటింది నాటి ప్రధాని వాజపేయి అని పేర్కొంటూ, నేటికీ ఆ ప్రయత్నాలు రెండు దేశాలనూ సమున్నత భాగస్వామ్య పీఠాన్ని అధిరోహించేలా చేశాయన్నారు. ఏవిధంగా చూసినా కూడా ఇరు దేశాలకూ అత్యంత కీలకమైన పరిణామమని పేర్కొన్న మోదీ, షాంఘై సహకార మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కట్టబెట్టే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు రష్యాకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్రిక్స్, ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ వంటి అంతర్జాతీయ అంశాల విషయంలోనూ భారత్, రష్యాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. 2000లో పుతిన్ రష్యా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతూనే వచ్చాయన్నారు. సోచిలో భేటీకి మోదీకి ఆహ్వానం పలికిన పుతిన్ ద్వైపాక్షిక మైత్రీబంధంలో దీన్ని సరికొత్త ఊతాన్నిచ్చే పరిణామంగా అభివర్ణించారు. మొదటినుంచీ రెండు దేశాలూ భాగస్వామ్య బంధంలో వ్యూహాత్మకతను పెంపొందించుకుంటూ వచ్చాయని, అలాగే రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య లోతైనా సంబంధాలు ఉన్నాయన్నారు. దీన్నిబట్టిచూస్తే రెండు దేశాల మధ్య విశ్వసనీయత ఎంత బలంగా నాటుకుందో అర్థమవుతుందన్నారు. ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్, ఎస్‌ఇవోలలో రెండు దేశాలూ కలిసిగట్టుగా పని చేస్తున్నాయని తెలిపారు. అలాగే గత ఏడాది రెండు దేశాల వాణిజ్యం పెరిగిందని, ఈ ఏడాది మొదటి కొన్ని నెలల్లోనే 17శాతం వృద్ధిని సాధించాయన్నారు.