అంతర్జాతీయం

వెయ్యిమంది గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలూ, అక్టోబర్ 5: ఇండోనేషియాలో సంభవించిన భూకంపంతో కూడిన పెను సునామీలో గల్లంతయిన సుమారు వెయ్యిమంది జాడ తెలియడం లేదని అధికారవర్గాలు శుక్రవారం నాడిక్కడ తెలిపాయి. ఈ ప్రకృతి విలయం అనంతరం కనిపించకుండాపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భయంకర భూకంపంతోబాటు సునామీ కారణంగా ఉవ్వెత్తున ఎగసిన నీటి కెరటాలు ముంచేయడంతో సులావెసీ ద్వీపంలోని పలూ సిటీ పూర్తిగా ధ్వంసమైంది. నివాస గృహాలు, కార్లు నాశనమయ్యాయి. సుమారు 1,558 మంది ఈ పెనువిపత్తులో అశువులుబాశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బలరోవాలోని ఓ ప్రభుత్వ గృహ సముదాయం కూలిపోవడంతో ఆ శిథిలాల కింద అనేక మంది సజీవ సమాధి అయ్యారని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గృహ సముదాయంలో సుమారు వెయ్యి నివాస గృహాలుండేవని, అవి పూర్తిగా నేలమట్టం కావడం వల్ల సుమారు వెయ్యిమందికి పైగా మృత్యువాత పడ్డారని ఇండోనేషియా అనే్వషణ, రక్షణ ఏజెన్సీకి చెందిన అధికార ప్రతినిది యూసుఫ్ లతీఫ్ తెలిపారు. కొంతమంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకునివుండవచ్చని కూడా ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనలో సుమారు వందమంది గల్లంతయ్యారని తొలుత అధికారులు అంచనా వేశారు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఘటన జరిగిన కొన్ని రోజులకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ దీనులు విధిలేని పరిస్థితుల్లో దైనందిన అవరాల కోసం దుకాణాలను, ఆహార వస్తువులతో కూడిన ట్రక్కులను టూటీ చేశారు. దీంతో వందలాది మందిని భద్రతా దళాలు చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతామంటూ హెచ్చరికలు జారీ చేశాయి. కాగా కూలిపోయిన ఇళ్ల శిథిలాల్లో ఎవరైనా చిక్కుకుని ప్రాణాలతో ఉంటే వారిని వెలికితీసేందుకు ప్రభుత్వం శుక్రవారం వరకు గడువువిధించినప్పటికీ ఇప్పటి వరకు అలాంటి ఒక్క వ్యక్తికూడా బయల్పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఓ రోడ్డు నిలువునా చీలిపోగా సమీపంలో ఉన్న ఇళ్లన్నీ నేలమట్టమట్టమైన ఓ దృశ్యం అందరినీ కలచివేస్తోంది. శునకాలు, స్కానర్ల సాయంతో సంయుక్తంగా అనే్వషణ కొనసాగిస్తున్న ఫ్రెంచ్, ఇండోనేషియా దళాలకు పలూలోని ఓ కూలిపోయిన హోటల్ శిథిలాల కింద ఓ వ్యక్తి బిగ్గరగా శ్వాసిస్తున్న చాయలు కనిపించాయి. అయితే శుక్రవారం అతన్ని వెలికితీయాలని ప్రయత్నిస్తున్న సమయంలో అతను మృతిచెందాడని అంతర్జాతీయ అత్యవసర అగ్నిమాపక దళం అధ్యక్షుడు ఫిలిప్పీ బెన్సన్ తెలిపారు. కాగా అనేక రోడ్లు కనీసం నడవడానికి కూడా వీలుకాని విధంగా ధ్వంసమయ్యాయి.