అంతర్జాతీయం

లైంగిక హింసపై పోరుకు నోబెల్ శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓస్లో, అక్టోబర్ 5: ప్రపంచ వ్యాప్తంగా లైంగిక హింసను నిరోధించేందుకు విశేషంగా కృషి చేసిన కాంగో దేశానికి చెందిన వైద్యుడు డాక్టర్ డెనిస్ ముక్‌వేజ్, ఇరాక్‌కు చెందిన యజ్దీ తెగకు చెందిన నదియా మురాద్ అనే మహిళకు 2018 ప్రతిషాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచ దేశాల్లో వివిధ సంఘర్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లైంగిక హింస, దోపిడీని డాక్టర్ డెనిస్, నదియామురద్‌లు వీరోచితంగా ఎదుర్కొని మహిళలు. బాలికల హక్కుల కోసం పోరాడారు. వీరి అమూల్యమైన సేవలు గుర్తించి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ చైర్‌పర్సన్ బెరిట్ రైస్ అండర్‌సన్ తెలిపారు. వీరిరువురికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. వీరిలో డెనిస్ డాక్టర్‌గా కాంగోలో పనిచేస్తున్నారు. నదియా ఉగ్రవాదుల ఆధిపత్యం ఉన్న ఇస్లామిక్ స్టేట్‌లో లైంగిక హింసకు గురయ్యారని బెరిట్ రైస్ అండర్‌సన్ చెప్పారు. లైంగిక హింస, దోపిడీ యుద్ధాల్లో ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, అంతర్జాతీయ సమస్యగా గుర్తించినట్లు ఆమె చెప్పారు. కాంగో రెండు దశాబ్ధాలుగా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. ఈ దేశంలో లైంగిక దోపిడీకి గురైన అనేక మంది బాలికలను డాక్టర్ డెనిస్ ఆదుకున్నారు. వారికి వైద్య సహాయం అందించారు. 63 ఏళ్ల డెనిస్ లైంగిక హింసకు బలైన యువతులు మానసికంగా నిలదొక్కుకునేందుకు వైద్య, మానసిక పరమైన వైద్య సహాయం అందించారు. 1999లో సౌత్ కివులో ఏర్పాటు చేసిన పాంజి ఆసుపత్రిలో తిరుగుబాటుదార్ల లైంగిక వాంఛలకు గురైన అనేక మంది బాలికలకు అహర్నిశలు వైద్య సహాయాన్ని డెనిస్ అందించారు. డాక్టర్ డెనిస్‌కు డాక్టర్ మిరాకిల్‌గా పాపులారిటీ సంపాదించారు. సైనికులు ప్రజల పట్ల అమానవీయంగా వ్యవహరించడం, బాలికలపై అత్యాచారాలకు పాల్పడడం హీనమైన చర్యని డాక్టర్ డెనిస్ ప్రచారం చేశారు. మహిళల భద్రతకు, లైంగిక దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు జాతీయంగా, అంతర్జాతీయంగా కృషి చేశారు.
ఇరాక్‌కు చెందిన యజ్దీ తెగకు చెందిన నదీమ్ మురాడ్ అనే మహిళను ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి లైంగిక హింసకు పాల్పడ్డారు. ఈ ఘటన 2014లో జరిగింది. అప్పటికి ఆమె వయస్సు 25 ఏళ్లే. మూడు నెలల పాటు తమ ఆధీనంలో ఉంచుకుని లైంగిక బానిసగా మార్చారు. అనంతరం ఆమె ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నారు. యజ్దీ తెగకు చెందిన వేలాది మంది మహిళలను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు అపహరించి అత్యాచారాలకు పాల్పడ్డారు. జీహాదీ ముసుగులో వీరి దమనకాండను ఎదిరించి నిలబడిన ధీర వనిత నదీమ్ మురాడ్ 2014 ఆగస్టులో ఉత్తర ఇరాక్ ప్రాంతంలో ఒక గ్రామం నుంచి నదీమ్‌ను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు తమను బలవంతంగామత మార్పిడి చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆమెచెప్పారు. వీరి చెర నుంచి బయటపడిన తర్వాత ఆమె అత్యాచారాలకు గురైన వేలాది మంది మహిళలకు అండగా నిలబడి వారికి మానసిక స్వాంతన చేకూర్చేందుకు అవిశ్రాంతంగా పోరాడారు. లైంగిక దోపిడీ, హింసకు వ్యతిరేకంగా మహిళలను సంఘటితపరిచి, వారి హక్కుల కోసం పోరాడినందుకు, తనకు జరిగిన అన్యాయం మరేమహిళకు జరగకకుండా చూసేందుకు తెగవతో పోరాడిన సాహసి నదీమ్ అని నోబెల్ కమిటీ చైర్‌పర్సన్ అండర్‌సన్ చెప్పారు.