అంతర్జాతీయం

ప్రకృతి వైపరీత్యాలతో అమెరికాకు చుక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనేవా: గత 20 సంవత్సరాలుగా జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఆర్థిక నష్టంతో పోలిస్తే ఇటీవల అమెరికాలో జరిగిన వాతావరణ సంబంధిత ప్రకృతి విళయాల వల్ల దేశంలో 2.25 బిలియన్లకు పైగా నష్టం సంభవించినట్టు ఆ దేశం బుధవారం ప్రకటించింది. ఇది గతంలో కన్నా 250 శాతం అధికమని తెలియజేసింది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యూఎన్‌ఐఎస్‌డిఆర్) ఈ మేరకు ప్రకటన చేస్తూ వాతావరణంలో తరచూ సంభవిస్తున్న పెనుమార్పుల వల్ల తుపానులు, వరదలు, సునామీ వంటివి సంభవిస్తున్నాయని తెలిపింది. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల 1978-1997 మధ్య అమెరికాకు 895 మిలియన్ డాలర్ల నష్టం సంభవించినట్టు సిఆర్‌ఇడి తన నివేదికలో వెల్లడించింది. అదే 1998-2017 మధ్య జరిగిన విలయాల వల్ల 2.25 బిలియన్ల నష్టం ఏర్పడింది. ముఖ్యంగా చైనా, జపాన్, ఇండియా దేశాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్థికంగా ఎక్కువ నష్టపోతున్నాయి. కేటగిరి నాలుగు తుపాను ఇటీవల గల్ఫ్ తీరంలోని ఫ్లొరిడాను తాకిందని, ఇది అమెరికా పశ్చిమ ప్రాంతం మీదుగా వెల్లడంతో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.
ఈ వైపరీత్యాలను మనం ముందుగా నివారించలేమని, అయితే, ప్రమాద హెచ్చరిక వ్యవస్థ ద్వారా అప్రమత్తం కాగలిగితే ధన, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని డిజాస్టర్ రిడక్షన్ యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి మామి మిజుటోరి తెలిపారు. 1998-2017 మధ్య 6,600 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, వైపరీత్యాల తీవ్రతను తగ్గించడానికి, వాతావరణంలో తీవ్ర మార్పులకు గల కారణాలపై పరిశోధనలను చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.