అంతర్జాతీయం

ఇన్‌ఫెక్షన్ అంతు చూసేందుకు సరికొత్త వైద్య విధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 10: మానవ శరీరంలోకి వ్యాపించి, పలురకాలపైన ఇన్‌ఫెక్షన్లను కలిగించే బాక్టీరియా, వైరస్‌ను సమర్థంగా నిరోధించడానికి సరికొత్త వైద్య విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అమెరికాలోని రట్‌గర్స్ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తలు జరిపిన పరిశోధనా ఫలితాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇప్పటి వరకూ బాక్టీరియాను నిరోధించడానికి యాంటీబయాటిక్స్‌ను టాబ్లెట్లు, ఇన్‌జెక్షన్లు రూపంలో వాడుతున్నారు. ఇవి అతి వేగంగా శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి. ఫలితంగా, బాక్టీరియా ఎక్కువ ఉన్న శరీర భాగాలేగాక, అసలు ఇన్‌ఫెక్షనే లేని భాగాలకూ ఔషధం వెళుతుంది. దీనితో, బాక్టీరియా బలపడి, యాంటీబయాటిక్స్ మోతాదును పెంచాల్సిన పరిస్థితిని కల్పిస్తుంది. అయితే, అమెరికా శాస్తవ్రేత్తలు ప్రతిపాదించిన విధానం ప్రకారం, ఔషధాన్ని తీసుకెళ్లే వాహకం దానిని ఒకేసారి కాకుండా, విడతల వారీగా విడుదల చేస్తుంది. అంతేగాక, బాక్టీరియా ఎక్కువగా ఉన్న శరీర భాగంలో ఎక్కువ మోతాదు మందును పంపుతుంది. అవసరం లేని భాగాలకు ఔషధం వెళ్లకుండా చాలా వరకు నిరోధిస్తుంది. ఈ ప్రక్రియ సహజంగానే అత్యంత శక్తివంతంగా పనిచేసి, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేస్తుంది. అయితే, ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించాల్సిన అవసరం ఉంది. సమర్థంగా పని చేస్తుందని అమెరికా ఔషధ శాఖ ఆమోద ముద్ర వేస్తే తప్ప ఈ విధానాన్ని ప్రయోగించే అవకాశం ఉండదు.