అంతర్జాతీయం

ఉగ్రవాద నిర్మూలనకు చేతులు కలుపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుషాంబే, అక్టోబర్ 12: ఉగ్రవాదం పంజాను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించే వాతావరణ మార్పులపై మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని, కాలుష్య కోరల్లోంచి మానవాళికి విముక్తి కల్పించాలన్నారు. శాంతి సాధించాలంటే సహకారం అవసరమని ఆమె చెప్పారు. శుక్రవారం ఇక్కడ ఆమె షాంఘై సహకార సంస్థ కౌన్సిల్ నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి ఉగ్రవాదం సవాలుగా తయారైందన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉగ్రవాదుల కదలికల సమాచారాన్ని ప్రపంచ దేశాలు ఇచ్చిపుచ్చుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ లేని పక్షంలో మానవాళి, వన్యప్రాణి మనుగడకు ముప్పువాటిల్లుతుందన్నారు. ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అన్ని దేశాలు విజ్ఞానాన్ని పరస్పరం మార్చుకోవాలన్నారు. 21వశతాబ్ధంలో ఉగ్రవాదం ప్రపంచానికి విసురుతున్న సవాళ్లనువిస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్నారు. ఈ సదస్సుకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ హాజరయ్యారు. షాంఘై సహకార సంస్థలో సభ్యత్వం ఉన్న దేశాలకు చెందిన ప్రతినిధులు సిరియా, కొరియా, ఆఫ్గనిస్తాన్‌కు చెందిన సమస్యలపై చర్చించారు. 2017 జూన్ నెలలో ఎస్‌సీవోకు చెందిన సభ్యత్వ దేశాల ప్రతినిధుల సమావేశం జరిగింది. 2005 నుంచి ఈ సంస్థలో భారత్ పరిశీలక హోదాలో కొనసాగుతోంది. చైనా ఆధిపత్యం ఉన్న ఈ సంస్థలో గత ఏడాది భారత్‌కు పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చారు. 2001లో షాంగైలో ఎస్‌సీవోను నెలకొల్పారు. ఆ సమావేశానికి రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, ఖజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్‌లకు గత ఏడాది సభ్యత్వం ఇచ్చారు. ఈ కూటమిలో ప్రపంచంలో 42 శాతం జనాభా కలిగి, 20 శాతం జీడీపీ ఉన్న దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో చైనాలో జరిగిన ఎస్‌సీవో సదస్సుకు మన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రతినిధులు హాజరయ్యారు.