అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉమ్మడి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 22: ఉగ్రవాదం, డ్రగ్ ట్రాఫికింగ్, బహుళజాతి నేర సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలి, పరస్పర సహకారాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న దిశగా షాంఘై సహకార మండలి (ఎస్సీవో) సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. జాతీయ భద్రతా ఉప సలహాదారు రాజీందర్ ఖన్నా, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ జాన్‌జువా సహా ఎస్సీవో సభ్య దేశాల టాప్ సెక్యూరిటీ అధికారులు రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశం నేటితో ముగిసింది. జూన్ 9, 10 తేదీల్లో చైనాలోని క్వింగ్డో సిటీలో ఎస్సీవో శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో, సభ్య దేశాల భద్రతా సలహాదారుల రెండురోజుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు భారత్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ సైతం హాజరవుతున్నారు. షాంఘై సహకార మండలిలో భారత్, పాక్‌లకు సభ్యత్వం లభించిన తరువాత జరుగుతున్న తొలి శిఖరాగ్ర సదస్సు ఇదే. ఖజకిస్తాన్, కిర్గిస్థాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాక్‌లతో కూడిన మండలిలో చైనా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుండటం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, వివిధ దేశాల భద్రతా మండలి కార్యదర్శులు హాజరైన సమావేశానికి జాతీయ భద్రతా మండలి కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్న రాజీందర్ హాజరై భారత్ వ్యూహాత్మక ఆలోచనలను బలంగా వినిపించారు. సమావేశంలో ఉగ్రవాదం, డ్రగ్ ట్రాఫికింగ్, బహుళజాతి నేర ప్రమాదాలపై సంఘటిత పోరాటానికి ఎలా అడుగులు వేయాలన్న వ్యూహాలపై లోతుగా చర్చించినట్టు భారత విదేశాంగ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే ఆఫ్గాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపైనే కాకుండా, ప్రాదేశిక, అంతర్జాతీయ ప్రాధాన్యతా అంశాలపైనా ప్రతినిధులంతా చర్చలు జరిపినట్టు ప్రకటనలో పేర్కొంది. అలాగే క్వింగ్డోలో నిర్వహించనున్న శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లు, చేపట్టాల్సిన భద్రతా చర్యలపైనా సమీక్ష నిర్వహింరని ఆ ప్రకటనలో పేర్కొంది.