అంతర్జాతీయం

ప్రతిభకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 14: అమెరికా ప్రతిభావంతులకే పట్టం కడుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం తమ దేశానికి వచ్చేవారు వృత్తిలో ప్రతిభావంతులై ఉండాలని, అలాంటి వారికి తాము అభ్యంతరం చెప్పబోమని ఆయన వెల్లడించారు. భారత్ సహా విదేశాల నుంచి వృతి నిపుణులు ప్రతిభావంతులై ఉండాలని ఆయన చెప్పారు.‘అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి నేను పదేపదే చెబుతున్నది ఒకటే. మా దేశానికి ఎవరు రావాలనుకున్నా న్యాయంగా, చట్టబద్ధంగా రావాలి. ఉద్యోగార్థులూ తమ నైపుణ్యానికి పదునుపెట్టాలి’అని వైట్ హౌస్‌లో మీడియా సమావేశంలో అధ్యక్షుడు విస్పష్టంగా ప్రకటించారు. అక్రమ వసలపై అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ సమాధానం ఇచ్చారు.‘యోగ్యత, మెరిట్ ఉన్నవారికే మేం మద్దతు ఇస్తాం. అలాంటి వారే ఇక్కడకు రావాలి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు’అని ట్రంప్ వెల్లడించారు. దేశానికి అనేక కంపెనీలు వెల్లువలా వస్తున్నాయని, వాటిలో పనిచేయడానికి ప్రతిభావంతమైన వృతి నిపుణుల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.‘మా దేశానికి వచ్చే విదేశీయలు అమెరికా అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ఆయా రంగాల్లో వారు నైపుణ్యం సాధించి ఉండాలి. ఆ అర్హతలున్నవారిని వదలుకోం. అది గుర్తించాలి’అని మీడియాను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ సమస్యను పరిష్కరించడం తనకు ఏమంత కష్టం కాదని అధ్యక్షుడు తెలిపారు. ప్రభుత్వం, కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గొలుసు వలస (చైన్ మైగ్రేషన్) విధానాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఆ విధానం అత్యంత లోపభూయిస్టగా ఉందని, దాని వల్ల దేశానికి చెడు జరుగుతోందని అధ్యక్షుడు విమర్శించారు. ఈ విషయంలో అనేక మంది తన వాదనే మద్దతు తెలుపుతున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనానే కాదు ఏ దేశం కూడా తమకు పోటీ కాదని ఆయన ప్రకటించారు. ‘ప్రపంచంలోనే అమెరికా గొప్పదేశం. అందరూ ఇక్కడకు రావాలని తహతహలాడతారు. ఒక విధంగా స్వర్గ్ధామంగా భావిస్తారు’అని ట్రంప్ అన్నారు. అమెరికాలోని అన్ని విభాగాలు అద్భుతంగా పనిచేస్తాయన్నారు. సరిహద్దు భద్రత, న్యాయవ్యవస్థ పనితీరును ప్రశంసించారు.