అంతర్జాతీయం

50వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: గత యేడాది యాభై వేలమంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది. అంతకు క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే 2017లో నాలుగువేల మందికి అధికంగా ఈ హక్కు లభించిందని ఆ దేశంలోని హోంలాండ్ సెక్యూరిటీ శాఖ తాజాగా వెల్లడించిన ఇమ్మిగ్రేషన్ నివేదిక వెల్లడించింది. 2017లో మొత్తం 50,802 మంది భారతీయులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పౌరసత్వం తీసుకున్నారు. 2016లో 46,188 మంది భారతీయులకు, 2015లో 42,213మంది భారతీయులకు ఈ దేశ పౌరసత్వం లభించింది. కాగా 2017లో అమెరికాలో మొత్తం 7,07,265 మంది విదేశీయులు ఈ దేశ పౌరులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు క్రితం 2016లో 7,53,060 మంది, అంతకుముందు 2015లో 7,30,259 మంది విదేశీయులు ఈ దేశ పౌరులుగా మారారు. 1,18,559 మంది విదేశీయులకు అమెరికన్ పౌరసత్వం లభించిన ప్రాంతంగా మెక్సికో అగ్రస్థానంలో ఉంది. ఇందులో రెండో స్థానంలో భారత్, తర్వాతి స్థానంలో 37,674 మందితో చైనా, 36,828 మందితో ఫిలిపీన్స్, 29,734 మందితో డోమినికన్ రిపబ్లిక్, 25,961 మందితో క్యూబా నిలిచాయి. కాగా అమెరికన్ పౌరసత్వం తీసుకున్న వారిలో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. మొత్తం 3,96.234 మంది మహిళలు అమెరికన్ పౌరసత్వం తీసుకోగా, 3,10.987 మంది పురుషులకు ఈ సదుపాయం లభించింది. ఇలావుండగా కాలిఫోర్నియాలో స్థిరపడిన పనె్నండు వేలమంది భారతీయులకు న్యూట్రలైజ్డ్ అమెరికన్ సిటిజన్‌షిప్ లభించింది. అలాగే న్యూజెర్సీలో 5,900 మందికి, టెక్సాస్‌లో 3,700 మంది భారతీయులకు ఈ పౌరసత్వం దక్కింది. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో సుమారు 7,100 మంది న్యూట్రలైజ్డ్ అమెరికన్లు నివవిస్తున్నారు.

అత్యాచార బాధిత బాలికకు స్కూళ్లలో అడ్మిషన్ నిరాకరణ
* బాలిక తల్లిదండ్రుల ఆవేదన
* డెహ్రాడూన్‌లో ఘటన
డెహ్రాడూన్, అక్టోబర్ 19: ఇక్కడి ఓ బోర్డింగ్ స్కూల్‌లో సామూహిక అత్యాచారానికి గురైన పదోతరగతి విద్యార్థినిని పాఠశాలల్లో చేర్చుకునేందుకు యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. దీంతో తమ కుమార్తె జీవితం మరింత దుర్భరస్థితిలోకి జారిపోతోందని బాధిత బాలిక తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బాలికను చేర్చుకుంటే తమ పాఠశాల వాతావరణం మారిపోతుందంటూ నిర్దయగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు పాఠశాలల్లో తమకు ఈ పరిస్థితులు ఎదురైనట్లు బాధిత కుటుంబీకులు తెలిపారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నివేదితాకుక్రెతి తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, ఇందుకు సంబంధించి పాఠశాలల యాజమాన్యాల వివరణను సైతం తెలుసుకునేందుకు ఓ బృందాన్ని దసరా సెలవుల అనంతరం సోమవారం పంపనున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదులోని అంశాలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాగా ఈ బాధిత బాలిక పట్ల పాఠశాలల తీరు దురదృష్టకరమని బాలల హక్కుల రక్షణ కమిషన్ ఉత్తరాఖండ్ మాజీ చైర్మన్ యోగేంద్ర కందూరి పేర్కొన్నారు. బాధితురాలికి మెరిట్ మార్కులు కూడా ఉన్నాయన్నారు. కాగా గత ఆగస్టు14న సాహస్‌పూర్‌లోని ఓ పాఠశాలలో సహవిద్యార్థులే ఈ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐతే ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం కప్పిపుచ్చగా ఆలస్యంగా నెల రోజుల తర్వాత సెప్టెంబర్ 17న వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి తొమ్మిదిమంది విద్యార్థులను, ఐదుగురు పాఠశాల సిబ్బందిని, డాక్టర్‌ను, ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల సీబీఎస్‌ఈ అనుబంధం సైతం రద్దయింది.