అంతర్జాతీయం

జన్మతః పౌరసత్వ చట్టంతో ‘బర్త్ టూరిజం’ పెరిగిపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికాలో పుడితే చాలు ఇక్కడ పౌరసత్వం వస్తున్న మాట ఏమో కాని దీనివల్ల దేశంలో మాత్రం ‘బర్త్ టూరిజం’ మాత్రం పెరుగుతోందని, చైనీయులు దీనివల్ల పెద్దయెత్తున లాభపడుతున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలంబియాలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ‘అక్రమ వలసదారులైనా, ఇక్కడ పౌరసత్వం లేనివారైనా ఫర్వాలేదు.. వారి పిల్లలు మాత్రం ఇక్కడ పుడితే చాలు వారికి జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తోంది... ఇదేం చట్టం.. మనం దీనిని మార్చాల్సిన అవసరం ఉంది.. ఈ ఒక్క బలహీనమైన చట్టం వల్ల అనేకమంది ఐదు, ఆరు నెలల గర్భవతులు వివిధ దేశాల నుంచి ఇక్కడకు వచ్చి పిల్లలను కంటున్నారు. దాంతో వారి పిల్లలు అమెరికా పౌరులైపోతున్నారు.. ఇతర దేశాల నుంచి ఇక్కడకు ఇలా వస్తున్న వారి వల్ల మన దేశంలో ‘బర్త్ టూరిజం’ మాత్రం పెరిగిపోతోంది’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వలసవాదులు ఇక్కడ పిల్లలను కంటూ అమెరికా పౌరులైపోవడాన్ని విపక్ష డెమోక్రాట్లు సమర్థిస్తున్నారు, ఇది ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం వందలు, కాదు వేల సంఖ్యలో ఇలా అక్రమంగా అమెరికా పౌరసత్వాన్ని పొందుతున్నారని ఆయన అన్నారు. దీనివల్ల ప్రతిఏడాది దేశానికి బిలియన్ డాలర్ల నష్టం ఏర్పడుతోందని అన్నారు. ఈ పాలసీకి మనం స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దక్షిణాసియా, లాటిన్ అమెరికాయే కాదు ఇప్పుడు చైనా నుంచి పెద్ద సంఖ్యలో ఇలా తరలివస్తున్నారని ఆయన చెప్పారు. ఒక విధంగా శత్రు దేశాలకు చెందిన వారి సంతానం సైతం మనపౌరులుగా చెలామణి అవుతున్నారని ఆయన అన్నారు. దేశంలోకి మొదటి ఒకరు వస్తున్నారని, తర్వాత వారి తమ్ముడు, సోదరి, అమ్మ, నాన్న ఇలా అందరూ అమెరికా వస్తారని, తర్వాత ఆంటీలు, ఆంకుల్స్, నానమ్మలు, తాతయ్యలు ఇలా అందరూ కట్టకట్టుకుని దేశంలోకి వస్తున్నారని, వీరికి అడ్డుకట్ట లేదా అని ట్రంప్ ప్రశ్నించారు. మనం ఇకనైనా దేశంలోని చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. దీనిపై కొత్త చట్టం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాలని విపక్షాలు అంటున్నాయని, వాస్తవానికి దీనిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తోనే సవరించవచ్చునని ట్రంప్ పేర్కొన్నారు. ఇక్కడ పుడితే చాలు పౌరసత్వం పొందే హక్కు ఒక్క అమెరికాలో మాత్రమే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో తదితర 30 దేశాల్లో సైతం ఇదే విధానం అమలులో ఉంది.