అంతర్జాతీయం

హెచ్-18 వీసా ప్రకియ మరింత సంక్లిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 2: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం హెచ్-18 దరఖాస్తు ప్రక్రియను సంక్లిష్టం చేస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో ఉన్న కంపెనీలు తమకు కావాల్సిన నిపుణులను హెచ్-18 వీసా కింద విదేశాల నుంచి రప్పించుకునేవి. అయితే ఈ ప్రక్రియ ఇప్పుడు అంత సులభం కాదు. దీనికి ఆయా కంపెనీలు అమెరికా ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంది. వారు ఇప్పటివరకు తమ సంస్థలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు ఎంతమంది, ఇప్పుడు హెచ్-18 వీసా కింద ఎంతమందిని రప్పిస్తున్నారు, ఆ పోస్టుల్లో నియమించడానికి స్థానిక పౌరులెవ్వరూ లేరా తదితర వివరాలను అమెరికా లేబర్ డిపార్టుమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. వారు దానిని పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతే హెచ్-18 వీసా కింద విదేశీయులను రప్పించుకోవచ్చు. ఈ వీసా కింద ఇప్పటికే పలువురు ముఖ్యంగా భారతీయ ఐటి నిపుణులు అమెరికాలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. ఈ విధానం సంక్లిష్టం చేస్తే భారతీయ నిపుణుల అమెరికా రాకకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.